నితిన్ హీరోగా డైరక్టర్ మేర్లపాక గాంధీ అందిస్తున్న అంధాదూన్ రీమేక్ 'మాస్ట్రో'. ఈ సినిమాలో కమర్షియల్ డ్యూయట్ వుండే అవకాశం తక్కువ.
పాటలు అయితే వున్నాయి కానీ ప్రేక్షకులకు కాస్త హుషారు కలిగించే స్టెప్ లు వేసే అవకాశం లేదు. అందుకే సినిమా ప్రమోషన్ కు పనికి వచ్చేలా, సినిమా లో చివర్న రోలింగ్ టైటిల్స్ టైమ్ లో చూపించడానికి పనికి వచ్చేలా ఓ సాంగ్ ను డిజైన్ చేసారు.
ఈ పాటను ఆర్ ఎఫ్ సి లో వేసిన ఓ భారీ సెట్ లో, టోటల్ స్టార్ కాస్ట్ అంతా పాల్గొనేలా ప్లాన్ చేసి చిత్రీకరించారు. సినిమాలో నటించిన ప్రతి యాక్టర్, యాక్ట్రెస్ ఈ పాటలో కనిపిస్తారు. తమన్నా..నితిన్ దగ్గర నుంచి చిన్న నటుల వరకు అంతా వుంటారు ఈ సాంగ్ లో.
ఈ పాటను షూట్ చేయడంతో మాస్ట్రో వర్క్ పూర్తయింది. సినిమాను ఈ నెలాఖరు లోపు పూర్తి చేసి హట్ స్టార్ కు కాపీ అందించాలి. ఇప్పటి వరకు వున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హాట్ స్టార్ లో ఆగస్టు 15కు విడుదలయ్యే అవకాశం వుంది.