శ్రీవిష్ణుకు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇప్పటితరం మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే ఓ 5-6 పేర్లు ఠక్కున గుర్తొస్తాయి. అలియాభట్, దీపిక నుంచి సౌత్ కు వస్తే సమంత, అనుష్క అని చెబుతారు ఎవరైనా. కానీ ఈ విషయంలో శ్రీవిష్ణు…

ఇప్పటితరం మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే ఓ 5-6 పేర్లు ఠక్కున గుర్తొస్తాయి. అలియాభట్, దీపిక నుంచి సౌత్ కు వస్తే సమంత, అనుష్క అని చెబుతారు ఎవరైనా. కానీ ఈ విషయంలో శ్రీవిష్ణు మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చాడు. తన ఫేవరెట్ హీరోయిన్ పార్వతి మీనన్.

“నా ఫేవరెట్ హీరోయిన్ పార్వతి మీనన్. ఆమె ఫెంటాస్టిక్ నటి. ఆమె యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఏ క్యారెక్టర్ అయినా చాలా సింపుల్ గా చేస్తారు. ఆవిడతో వర్క్ చేయాలని ఉంది. ఆమె నా ఫేవరెట్.”

ఇలా తన ఫేవరెట్ నటి ఎవరనే విషయాన్ని బయటపెట్టాడు శ్రీవిష్ణు. చేసిన తక్కువ సినిమాలతోనే మలయాళంలో మంచి పేరుతెచ్చుకుంది పార్వతి మీనన్. అందుకే ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని భావించాడు. ఇక శ్రీవిష్ణుకు ఇష్టమైన హీరో ఎవరనే విషయం అందరికీ తెలిసిందే. అతడికి వెంకటేష్ అంటే పిచ్చి. చిన్నప్పట్నుంచి వెంకీ సినిమాల్ని ఏదీ వదలకుండా చూశాడు.

“బొబ్బిలిరాజాతో నా మనసులో బలమైన ముద్ర పడిపోయింది. ఓసారి ముద్ర పడితే ఇక వదలదు అంటారు కదా అలా వెంకటేష్ గారికి వీరాభిమానిని అయిపోయాను. ఆయన నటించిన సినిమాలన్నీ చూశాను. తెలుగులో చాలామంది హీరోలంటే ఇష్టం. వెంకటేష్ గారంటే బాగా ఇష్టం.”

ప్రస్తుతం శ్రీవిష్ణుకు సంబంధించి ఓ సినిమా సెట్స్ పై ఉంది. లాక్ డౌన్ తర్వాత మరో 2 సినిమాలు ఎనౌన్స్ చేస్తానంటున్నాడు ఈ హీరో. 

జగన్ ని అభినందిస్తున్నా

మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం