అమలాపాల్ మాజీ భర్తకు మళ్లీ పెళ్లి

హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లు విడిపోయారు. అలా కొన్నేళ్లుగా…

హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లు విడిపోయారు. అలా కొన్నేళ్లుగా సింగిల్ గా ఉంటున్న ఏఎల్ విజయ్, ఇప్పుడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడు.

జులైలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఏఎల్ విజయ్ స్వయంగా ప్రకటించాడు. మన్నివక్కమ్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే డాక్టర్ ను తను పెళ్లాడబోతున్నానని, ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని కూడా స్పష్టంచేశాడు. తన ప్రెస్ నోట్ లో పెళ్లి తేదీని మాత్రం ఏఎల్ విజయ్ చెప్పలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఆయన జులై 11న ఐశ్వర్యను పెళ్లాడబోతున్నాడు.

అభినేత్రి, అభినేత్రి-2 సినిమాలు తీసింది ఇతడే. మధ్యలో లక్ష్మి, కణం లాంటి మరో రెండు సినిమాలు కూడా డైరక్ట్ చేశాడు. అలా పూర్తిగా దర్శకత్వంపై దృష్టిపెట్టిన విజయ్, ఇప్పుడు మరోసారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పెళ్లి తర్వాత కంగనారనౌత్ లీడ్ రోల్ లో జయలలిత బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఏఎల్ విజయ్.

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి