ఎక్స్ క్లూజివ్.. బన్నీ ఆ గెటప్ లో..

సుకుమార్-బన్నీ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులే అయింది. ఆ తరువాత వేణు శ్రీరామ్-దిల్ రాజు-సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే లేటెస్ట్ విషయం ఏమిటంటే, వేణు శ్రీరామ్ డైరక్షన్ లో…

సుకుమార్-బన్నీ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులే అయింది. ఆ తరువాత వేణు శ్రీరామ్-దిల్ రాజు-సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే లేటెస్ట్ విషయం ఏమిటంటే, వేణు శ్రీరామ్ డైరక్షన్ లో చేసే లో బన్నీ రెండుకు పైగానే గెటప్ ల్లో కనిపిస్తాడట. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ మిడిల్ ఏజ్డ్ గెటప్ లో కనిపించబోతున్నాడట.

యంగ్ ఏజ్ లో ఓ గెటప్, అలాగే మిడిల్ ఏజ్డ్ లో ఓ గెటప్ ఈ సినిమాలో వుంటాయని తెలుస్తోంది. అలాగే ఇంకో గెటప్ కూడా వుంటుందని, ఇది ఎలా వుంటుందో ఇంకా రివీల్ కాలేదని తెలుస్తోంది. సినిమాలో బన్నీకి కాస్త ఎక్కువగానే విగ్ లు వాడాల్సి వుంటుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు బన్నీ రకరకాల గెటప్ ల్లో కనిపించినా, వయసు మళ్లిన గెటప్ లేదా ఫార్టీ ఇయర్స్ లుక్ లో కనిపించలేదు. ఐకాన్ సినిమా ఆ విధంగా ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాగే బన్నీకి విగ్ లు వాడడం అన్నది రేర్. కానీ ఐకాన్ సినిమాలో మాత్రం రెండు మూడు రకాల విగ్ లు వాడతారని తెలుస్తోంది.

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి