ఉత్తరాంధ్రా మీద ఆ పార్టీ ఫోకస్

ఉత్తరాంధ్రా వెనకబడిన జిల్లాలు కలిగిన ప్రాంతం. ఏకంగా ఆరు జిల్లాలు ఇపుడు ఉన్నాయి. ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఎనభై శాతం బీసీలు ఉన్న ప్రాంతం. దాంతో ఉత్తరాంధ్రాను ఒడిసిపట్టాలని ప్రతీ పార్టీ…

ఉత్తరాంధ్రా వెనకబడిన జిల్లాలు కలిగిన ప్రాంతం. ఏకంగా ఆరు జిల్లాలు ఇపుడు ఉన్నాయి. ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఎనభై శాతం బీసీలు ఉన్న ప్రాంతం. దాంతో ఉత్తరాంధ్రాను ఒడిసిపట్టాలని ప్రతీ పార్టీ ప్రయత్నించడం సహజం.

ఇక చూస్తే జనసేన పార్టీకి గోదావరి జిల్లాల తరువాత ఏ మాత్రమైన ఆశలు ఉన్న ప్రాంతం అంటే ఉత్తరాంధ్రా జిల్లాలే అని చెబుతారు. అలాంటి ఉత్తరాంధ్రా జిల్లాల మీద ఆ పార్టీ దృష్టి సారించినట్లుంది. జనసేన నాయకుడు నాగబాబు ఉత్తరాంధ్రా టూర్ కి రెడీ అయ్యారు.

ఆయన జూన్ 1 నుంచి 3 వరకూ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో పర్యటిస్తారు అని పార్టీ వర్గాల భోగట్టా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో నాగబాబు పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు నేతలకు దిశా నిర్దేశం చేయడానికి నాగబాబు ఈ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.

ఇక విశాఖ జిల్లా గాజువాక నుంచి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఉత్తరాంధ్రాలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం సాగుతున్న నేపధ్యంలో నాగబాబు టూర్ చేయడం విశేషమే అనుకోవాలి.