ఒక పక్క పొలిటికల్ యాక్టివిటీ పెరుగుతోంది. మరోపక్కన పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల జాబితా కూడా పెరుగుతోంది.
పవన్ కు మూడ్ కుదిరినపుడు, వీలు కలిగినపుడు, అవకాశం దొరికినపుడు సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. దాంతో ఆయన ప్రస్తుతం ఫినిష్ చేయాల్సిన హరి హర వీరమల్లు సినిమా ఇంకో 70 రోజులు షూటింగ్ బకాయి వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ సినిమా ఎప్పటికి రెడీ అవుతుందో అన్నది అనుమానమే.
మే నెలలో ఒక షెడ్యూలు జరగాల్సి వుంది. కానీ పవన్ దాన్ని క్యాన్సిల్ కొట్టారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. జూన్ నెలలో ఆ షెడ్యూలు పూర్తి చేస్తారని యూనిట్ ఆశగా చూస్తోంది. ఇదిలా వుంటే సముద్రఖని డైరక్షన్ లో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ రీమేక్ చేయాల్సి వుంది. దాని స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది.
ఆ యూనిట్ కూడా పవన్ డేట్ ల కోసం చూస్తోంది. జూలై నుంచి డేట్ లు ఇస్తారని ఆశిస్తోంది. పవన్ డేట్ లు ఆ సినిమాకు జస్ట్ ఇరవై రోజులు ఇస్తే చాలు. ఇవన్నీ దాటిన తరువాత కానీ హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' స్టార్ట్ కాదు.
హీరో లేని ఎపిసోడ్ లు ముందుగా తీసే ఆలోచనలో ఆ సినిమా యూనిట్ వుంది కానీ దానికి కూడా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి వుంది. అదెప్పుడు వస్తుందో తెలియదు.