రెపరెపలాడుతోన్న తెలుగు జెండా

బాహుబలి తెలుగు సినిమా జెండాని ఉత్తరాదిలో పాతేసింది. ఇంతవరకు హిందీ సినిమాలకి కూడా వల్ల కాని వసూళ్లని సాధించి, ఇప్పట్లో చేధించ సాధ్యం కాని వసూళ్లని వారి ముందుంచుంది. తెలుగు అనువాద చిత్రం ఇప్పటికీ…

బాహుబలి తెలుగు సినిమా జెండాని ఉత్తరాదిలో పాతేసింది. ఇంతవరకు హిందీ సినిమాలకి కూడా వల్ల కాని వసూళ్లని సాధించి, ఇప్పట్లో చేధించ సాధ్యం కాని వసూళ్లని వారి ముందుంచుంది. తెలుగు అనువాద చిత్రం ఇప్పటికీ నార్త్‌లో టాప్‌లో వుందనే వాస్తవాన్ని అక్కడి ట్రేడ్‌ లోకం కూడా జీర్ణించుకోలేకపోతోంది. బాహుబలి 2 వచ్చి రెండేళ్లు దాటినా ఇంకా బాలీవుడ్‌ చిత్రం ఏదీ దాని దరిదాపులకి చేరుకోలేకపోయింది.

ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తన సత్తా చాటుకున్నాడు. 'అర్జున్‌ రెడ్డి' రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సందీప్‌ తీసిన 'కబీర్‌ సింగ్‌'ని అక్కడి విమర్శకులు చీల్చి చెండాడారు. సినిమా సబ్జెక్ట్‌, క్యారెక్టర్‌ ఏమిటనేది పట్టించుకోకుండా దర్శకుడి క్రియేటివిటీని తప్పుబట్టారు. అయినా కానీ కబీర్‌ సింగ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ భరతం పడుతోంది. ఇంతకాలం నార్త్‌ వాళ్లకి దక్షిణాది అంటే తమిళ చిత్రాలు, తమిళ దర్శకులే. కానీ రాజమౌళి, సందీప్‌ వల్ల ఇప్పుడు తెలుగు దర్శకులకి డిమాండ్‌ పెరిగింది.

ఇక్కడి సినిమాలని రీమేక్‌ చేయదలిస్తే మన దర్శకులతోనే రీమేక్‌ చేయించాలనే స్థాయికి అక్కడి హీరోలు, నిర్మాతలు పట్టుబడుతున్నారంటే మన టాలెంట్‌ని ఎంతగా గుర్తించారనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే మన అనువాద చిత్రాలకి హిందీ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ వుంది. రానున్న రోజుల్లో సాహో, సైరాలాంటి చిత్రాలతో హిందీ మార్కెట్‌పై తెలుగు సినిమాకి పూర్తి పట్టు లభించనుంది.  

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి