అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల చిత్రం డిసెంబర్‌లోనే విడుదలవుతోందనే దానిపై వివిధ థియరీలు మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఒక భారీ చిత్రానికి సంక్రాంతి కంటే బెటర్ సీజన్ లేదనేది ఇంతకుముందు చాలాసార్లు రుజువయింది కనుక ఆ థియరీల కంటే కమర్షియల్ అవుట్‌పుట్ ముఖ్యమని సంక్రాంతి బరిలోనే ఈ చిత్రాన్ని నిలబెట్టబోతున్నారు.
దీంతో సంక్రాంతికి ఆల్రెడీ బరిలో వున్న మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి అతి పెద్ద పోటీదారుగా ఈ చిత్రం నిలుస్తుంది. రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో విడుదలయితే దేనికి అడ్వాంటేజ్ వుంటుందనేది పూర్తిగా కాంటెంట్‌పై డిపెండ్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమాకి పకడ్బందీ స్క్రిప్ట్ పెట్టుకుని ఫ్యామిలీ డ్రామాతో త్రివిక్రమ్ ఈసారి బాక్సాఫీస్ మీదకి దండెత్తుతోంటే, మహేష్ చిత్రానికి అనిల్ రావిపూడి లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడున్నాడు.
సంక్రాంతి బరిలో దిగేందుకు మిగతా నిర్మాతలంతా జంకే విధంగా రెండు పందెం పుంజులు సిద్ధం అవడంతో 2020 అప్పుడే ఆసక్తికరంగా మారిపోయింది. ప్రతి సంక్రాంతికి విధిగా వస్తోన్న బాలకృష్ణ సినిమా వచ్చే సంక్రాంతికి కూడా విడుదల కానుంది కనుక ఇక మిగతా సినిమాలకి స్పేస్ లేదనే చెప్పాలి. మరి ఈ మెగా క్లాష్‌లో ఏ చిత్రం సంక్రాంతి విజేతగా నిలుస్తుందనేది వేచి చూడాలి.