కాంగ్రెస్.. చివరకు ఏమవుతుంది?

తనకు అధ్యక్ష పదవి వద్దే వద్దు అని అంటున్నాడు రాహుల్ గాంధీ. ఈ విషయంలో మరో ఆలోచనే లేదని.. ఆయన తేల్చిచెబుతూ ఉన్నారు. ఈ అంశంపై తల్లి సోనియా, చెల్లెలు ప్రియాంక ఒత్తిడి చేసినా…

తనకు అధ్యక్ష పదవి వద్దే వద్దు అని అంటున్నాడు రాహుల్ గాంధీ. ఈ విషయంలో మరో ఆలోచనే లేదని.. ఆయన తేల్చిచెబుతూ ఉన్నారు. ఈ అంశంపై తల్లి సోనియా, చెల్లెలు ప్రియాంక ఒత్తిడి చేసినా రాహుల్ గాంధీ మాత్రం… తను రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టుగా తేల్చిచెబుతూ ఉన్నారట. ఆఖరికి ఈ విషయంలో తాము చెప్పేదేం లేదని వారు కూడా ఊరికే అయిపోయారని వార్తలు వస్తున్నాయి.

ఇక రాజీనామా వద్దంటూ రాహుల్ కు ఇతర మిత్రపక్షాల నేతలు కూడా సూచించారు. అయినా రాహుల్ మాత్రం ఎవ్వరిమాటా వినడంలేదు. తను రాజీనామా అన్నాకా.. రాజీనామానే.. అని ఆయన అంటున్నారట. ఆయన తీరును అర్థం చేసుకుని నెక్ట్స్ చేయాల్సిందేమిటో చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం.. తీరు మార్చుకోవడం లేదు.

రాహుల్ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ లో పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఆయన రాజీనామా ఉపసంహరించుకోకపోతే తాము కూడా రాజీనామానే అంటూ వారు హడావుడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాహుల్ అలా, కాంగ్రెస్ నేతలు ఇలా.. మొత్తానికి ఈ వ్యవహారాలను గమనిస్తే.. ప్రతిపక్ష పార్టీగా మోడీకి ఎక్కడో ఒకచోట అయినా ముకుతాడు వేయాల్సిన కాంగ్రెస్ ఎటు పోతోందో.. చివరకు ఏమవుతుందో అనే చర్చ సాగుతూ ఉండటం గమనార్హం!

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి