పవన్ కళ్యాణ్ కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇక జనసేన అధినేతగా ఆయన ఉన్నారు. ఆ విధంగా చూసిన జనసైనికులు కూడా ఉన్నారు. పవన్ కి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వారు మాట్లాడుతారు. కానీ విశేషం ఏమిటి అంటే జనసైనికులకు కూడా రాని విచిత్రమైన ఆలోచనలు అనవసర భయాలు తెలుగుదేశం నాయకులకు రావడం అంటే ఏమనుకోవాలి
విశాఖలో ఈ మధ్యన జరిగిన ఒక బ్రహ్మాండమైన బీచ్ క్లీన్ కార్యక్రమానికి అటెండ్ అయిన ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా చిత్తశుద్ధితో ఒక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అని ఆయన ప్రకటించారు. అంతే కాదు తన ఫ్లెక్సీలు ప్లాస్టిక్ తో పెట్టినా తొలగించాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.
దీన్ని జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ కూడా స్వాగతించారు. కానీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితకు మాత్రం ఇందులో ఏదో కుట్ర దురుద్దేశ్యం కనిపించాయంట. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న వస్తోందిట. ఆ రోజున ఏపీ అంతా పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కడతారు కాబట్టి ముందుగానే ఆలోచించి ప్లాస్టిక్ ఫ్లెక్సీలని నిషేధించాలని జగన్ నిర్ణయించారని అనిత అంటున్నారు.
ఇంతకంటే విచిత్ర వాదన, వింత ఆరోపణ ఉంటుందా అని వైసీపీ నేతలు అంటున్నారు. ప్లాస్టిక్ ని ఏపీలో లేకుండా చేయడానికి 2027 దాకా గడువు పెట్టుకుని సర్కార్ గట్టిగా పని చేస్తోంది. పార్లే అనే ఇంటర్నేషనల్ సంస్థతో కీలకమైన ఒప్పందం చేసుకుంది. విశాఖలోనే ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
ఇవన్నీ కూడా కేవలం ఒకరిని దృష్టిలో పెట్టుకుని చేసే పనులేనా. విమర్శలు చేయాలంటే ఇలాగ కూడానా అనిపించేలా టీడీపీ వారు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.