టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. అలనాటి హీరో, ప్రముఖ సీనియర్ నటుడు విద్యాసాగర్ కన్ను మూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా పక్షవాతం గురైనా ఆయన వీలు చెయిర్ కే పరితమయ్యారు.
ఈ చదువులు మాకొద్దు సినిమాతో విద్యాసాగర్ హీరోగా సినిమాలో పరిచయమయ్యారు.జంధ్యాల దర్శకత్వంలో చాల సినిమాలో హీరోగా నటించారు. విద్యాసాగర్ రాజు తన కెరీర్ లో 100కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు, ఆయన రచయిత కూడా. వీల్ చెయిర్ కు పరిమితమైన సరే ఆయన వీల్ చైర్ లో కూర్చుని పలు సినిమాల్లో నటించడం విశేషం. అలా కూడా నటనలో ఆయన మంచి పేరు సంపాదించారు.
విద్యాసాగర్ భార్య రత్న ప్రభ కూడా సినిమాలో నటించారు. ఆమె కూడా జంధ్యాల సినిమాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఇరువులు కలిసి కూడా నటించారు.
విద్యా సాగర్ రావు మరణ వార్త తెలిసి పలువురులు ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.