Advertisement

Advertisement


Home > Politics - National

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న కాంగ్రెస్!

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న కాంగ్రెస్!

ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి సార‌ధి రాబోతున్నారు. మూడు సంవ‌త్స‌రాల నుండి చ‌ర్చ‌లు జ‌రిపి చివ‌రిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌కు తేదీల‌ను ఖ‌రారు చేసింది. 

తదుపరి ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్‌ను ఆమోదించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆదివారం జూమ్ లో సమావేశమైంది. విదేశాల్లో ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంల్లో పాల్గొన్నారు.

సెప్టెంబ‌ర్ 22 న నోటిఫికేష‌న్ జారీ చేసీ, అదే నెల 24 నుండి 30 వ‌ర‌కు నామినేష‌న్ లు స్వీక‌రిస్తారు. అక్టోబ‌ర్ 1 ప‌రిశీల‌న, అక్టోబ‌ర్ 8 వ‌ర‌కు ఉప‌సంహ‌ర‌ణ చేసుకోనే అవ‌కాశం ఇచ్చారు. అక్టోబ‌ర్ 17 న ఎన్నిక‌లు జ‌రిపి అక్టోబ‌ర్ 19 కౌంటిగ్ చేసి అదే రోజు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 మధ్యలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని గత ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రకటించింది.

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో ఓటమిని చవిచూడడంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్ప‌టి నుండి తాత్కాలిక అధ్య‌క్షురాలిగా సోనియా గాంధీ కోన‌సాగుతున్నారు. గాంధీ ఫ్యామిలీ నుండి బ‌య‌ట వ్య‌క్తులు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్ట‌ల‌ని అనుకుంటూంటే.. మోజారిటి వ‌ర్గం నాయకులు మాత్రం గాంధీ కుటుంబ‌మే అధ్య‌క్ష భాద్యత‌లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేపట్టబోతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

 


  • Latest News
    Advertisement
    
  • Advertisement