గత మూడు సంవత్సరాలు రాయలసీమ మొత్తం రైతులు అనందంగా ఉన్నారు. టైంకి వర్షాలు పడుతూ, చెరువులు, బోరు బావులు నిండి రైతులు సంతోషంతో పంటలు వేసుకుంటూన్నారు. ఎక్కడ గోడవలు జరగకుండా పల్లెలు అభివృధి అవుతుంటే రాజకీయ నాయకులు ఓర్వలేక పోతున్నట్లు కనడుతోంది. పూర్వ అనంతపురం జిల్లా ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లాలో రాజకీయం అలాగే కనపడుతోంది. రెండు రోజుల క్రితం వైసీపీ వైస్ సర్పంచ్ కిడ్నాప్ సంబంధించి ఇవాళ రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పంధించారు. సూటిగా డొంక తిరుగుడు లేకుండా దాడి మేమేం చేశాం అని క్లారిటీ ఇచ్చారు.
తమ పార్టీ వ్యక్తిని పరిటాల కుటుంబం కిడ్నాప్ చేయాడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నమన్నారు. ఉప సర్పంచ్ రాజా రెడ్డిని పరిటాల శ్రీరామ్ స్వయంగా చంపాలనుకున్నారని అందుకే మా సోదరుడు స్వయంగా వెళ్లి కాపాడారన్నారు. పరిటాల కుటుంబ దౌర్జన్యాలపై పోరాటనికి సిద్ధమన్నారు.
పరిటాల కుటుంబం ప్రతిసారి పోలీసులను తిడుతూ హీరోయిజం అనుకుంటూన్నారు. కానీ వారికి భద్రత కల్పిస్తున్నది కూడా పోలీసులేనన్నారు. ఇంకో సారి ఇలాంటి దౌర్జన్యలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ప్రశాంతగా ఉన్న రాప్తాడును పరిటాల కుటుంబం గోడవలు సృష్టించి ప్రజలకు ప్రశాంతాత లేకుండా చేస్తున్నారంటూ పరిటాల కుటుంబంపై మండి పడ్డారు వైసీపీ ఎమ్మెల్యే. గత మూడు సంవత్సరాల నుండి అనంతపురంలో ఎక్కడ గోడవలు లేకుండా ఉన్నాయి. కానీ తమ రాజకీయం కోసం గందరగోళం సృష్టించే వారిని ప్రజలు దూరం పెడతారు అనేది తెలుసుకోవాలి. ఇంకా ఇలాంటి వచ్చే ఎన్నికల వరకు చూడాల్సి వస్తుంది.