డియర్ కామ్రేడ్… వరల్డ్ ఫేమస్ లవర్..కన్నా పెద్ద డిజాస్టర్ అన్నట్లుగా అయిపోయింది లైగర్ పరిస్థితి. నోటా తరువాత టాక్సీవాలా వచ్చింది. లేదా అంటే నాలుగు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు అనే మాట వచ్చేది.
చాలా సెంటర్లలో ఇటీవల డిజాస్టర్ అయిన థాంక్యూ రెండో రోజు కలెక్షన్ల కన్నా లైగర్ రెండోరోజు కలెక్షన్లు తక్కువ. ఎపిక్ ఫ్లాప్ అయిన సినిమా కలెక్షన్ల సంగతి అలా వుంచితే, లైగర్ విడుదల కాకుండానే స్టార్ట్ చేసిన సినిమా జనగణమన. ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్ మీదే రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో మైహోమ్ సంస్థ కూడా భాగస్వామి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ సినిమా చేయడం సరికాదు అని హీరో భావిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. హీరో ఈ విషయాన్ని పూరి కనెక్ట్స్ నిర్మాణ భాగస్వామి చార్మికి చెప్పేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్నా కూడా దానికి కూడా కొద్దిగా గ్యాప్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. విపరీతమైన బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. అలాగే నిర్విరామంగా లైగర్ ప్రమోషన్లు చేసారు. అందువల్ల కాస్త విశ్రాంతి అవసరం అని తెలుస్తోంది. ఖుషీ వర్క్ పూర్తి కావడానికి కొద్దిగా సమయం పడుతుంది. అప్పటికి కానీ అఫీషియల్ గా జనగణమన మీద ఓ క్లారిటీ రాదు. అంతవరకు ఇలా వదంతులు వినిపిస్తూనే వుంటాయి..
ఇదిలా వుంటే క్యాన్సిల్ అన్న మాట లేదని మెరాకో లో రెండు నెలల పాటు షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని పిసి కనెక్ట్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.