ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగిన ప్రైవేట్ సంభాషణ మీకు ఎలా తెలుస్తుంది. ఎలా వక్రీకరిస్తారు…ఇదీ కేసిఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అడిగిన క్వశ్చను.
దానికి సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే సమాధానం…’ అదే జర్నలిజం అంటే..’
దీనికి కవిత కౌంటర్…వక్రీకరణే జర్నలిజం అంటే ఇంక నేనేం మాట్లాడలేను
ఈ రోజు ఎబిఎన్ లో ఆర్కేకు కవిత కు మధ్య డిబేట్ నడిచింది. ఈ సమయంలో కవిత సున్నితంగా అయినా గట్టిగానే పాయింట్లు లాగారు. భాజపాకు సపోర్ట్ చేసుకుంటా అని చెప్పేయండి అంటూ నిలదీసారు.
గమ్మత్తేమిటంటే సిబిఐ కేసులో పేరు లేకుండానే మీరు ఎలా చెబుతారు అని కవిత ప్రశ్నిస్తే, వస్తుంది చూడు అంటూ ఆర్కే భవిష్యత్ దర్శనం చేయడం విశేషం.
నిజానికి తండ్రీ కూతుళ్ల మధ్య జరిగిన ఈ సంభాషణ ఇద్దరిలో ఎవరి ద్వారా మూడో వ్యక్తికి చేరినా, ఆ వైనం సంపాదించి ప్రచురించడం జర్నలిజమే. అందులో సందేహం లేదు. కానీ తండ్రీ కూతురు తమ మధ్య జరిగిన సంభాషణను ఎవ్వరికీ చెప్పనపుడు, ఊహించి రాయడం అంటే జర్నలిజమేనా అన్నది కాస్త సందేహమే.
మధ్యలో ఆర్కే వైఎస్ జగన్ ను ప్రస్తావనకు లాగినా కవిత తోసి పుచ్చారు. దేశం అన్ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ లో నడుస్తోందని, మనం ఏమీ చేయలేదని, ఏం చేసినా భరించాల్సిందే అని కవిత అన్నారు. అధికారంలో వున్న భాజపా ఏం చేసినా చేయగలిగింది ఏమీ లేదని, పోరాడడం తప్ప మరో బాట లేదని అన్నారు.
గమ్మత్తేమిటంటే మోడీని కేసిఆర్ తిట్టడం తప్పు అని, విమర్శించాలి కానీ తిట్టడం సరి కాదని అంటున్నారు ఆర్కే. మరి గతంలో చంద్రబాబు చేసింది ఏమిటో?