టీడీపీ కంచుకోటలో వైసీపీ ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి భీమునిపట్నం నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైన సహకార సంస్థను ఏకగ్రీవంగా వైసీపీ గెలుచుకుని తన సత్తా చాటింది. అడవివరం సహకార సంస్థను అసలు ఎన్నికల ఊసే లేకుండా వైసీపీ తన…

తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి భీమునిపట్నం నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైన సహకార సంస్థను ఏకగ్రీవంగా వైసీపీ గెలుచుకుని తన సత్తా చాటింది. అడవివరం సహకార సంస్థను అసలు ఎన్నికల ఊసే లేకుండా వైసీపీ తన పరం చేసుకోవడంతో ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ అవంతి శ్రీనివాసరావు తనదైన రాజకీయ వ్యూహాలతో టీడీపీ పోటీలో నుంచి తప్పుకునేలా చేశారని అంటున్నారు.

అడవివరం సొసైటీకి చాలా పేరు ఉంది. ఇక గతంలో జరిగిన ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి. ఇక్కడ టీడీపీకి కూడా బలంగా ఉంది. అయితే ధీటైన అభ్యర్ధులను నిలబెట్టడంతో పాటు ఎన్నికలు జరిగినా వైసీపీ విజయం ఖాయం అన్న పరిస్థితిని మాజీ మంత్రి తీసుకురావడంతో ఎన్నికల కంటే ముందే టీడీపీ సహా ఇతర పక్షాలు తప్పుకున్నాయని తెలుస్తోంది.

నిజానికి సెప్టెంబర్ 1న ఈ ఎన్నిక జరగాల్సి ఉంది. వైసీపీ తరఫున నిలబెట్టిన కర్రి అప్పలస్వామి ప్యానల్ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైంది. తద్వారా మాజీ మంత్రి తన సమర్ధతను  చాటుకున్నారు. భీమిలీలో 2024 ఎన్నికలలో సైతం టీడీపీ కంచుకోటను మరోసారి గెలుచుకోగలమన్న విశ్వాసాన్ని ఆయన క్యాడర్ కి కలిగించారని అంటున్నారు. 

వచ్చే ఎన్నికల్లో భీమిలీ మీద టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పటిదాకా చూస్తే స్థానిక ఎన్నికలు సహా అన్ని చోట్లా మెజారిటీ స్థానాలు వైసీపీ పరం అయ్యాయి. దాంతో వైసీపీ జెండా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎగరడం ఖాయమే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.