సీజేఐగా చివ‌రి రోజు… 5 హై ప్రొఫైల్ కేసుల్లో తీర్పులు

దేశ సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత పదవిలో ఉన్న తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ నేటితో తన పదవీ కాలాన్ని ముగించుకోబోతున్నారు.  Advertisement సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రెండో తెలుగు…

దేశ సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత పదవిలో ఉన్న తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ నేటితో తన పదవీ కాలాన్ని ముగించుకోబోతున్నారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రెండో తెలుగు వ్యక్తి కావ‌డం విశేషం. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప‌ని చేసిన‌ జస్టిస్‌ కోకా సుబ్బారావు పదవికి వన్నె తెచ్చి తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. 

ఆ తరువాత మ‌రో తెలుగు వ్య‌క్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ సుప్రీం కోర్టు 48వ న్యాయమూర్తిగా ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టి 16 నెల‌ల‌పాటు న్యాయవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి న్యాయ వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ .. న్యాయ వ్యవస్థకు లోబడి .. పనిచేసి .. తన పదవికి వన్నె తెచ్చారు. ఆయన నేడు పదవీ విరమణ చేయనున్నారు. 

ఇవాళ ప‌ద‌వి విర‌మ‌ణ అవుతూ సీజేఐ ఎన్వీ రమణ 5 హై ప్రొఫైల్ కేసుల్లో చివరి రోజు తీర్పులు వెల్లడించనున్నారు. ఎన్నికల ఉచిత హామిలు, 2007 గోరఖ్‌పూర్ అల్లర్లపై, కర్ణాటక మైనింగ్ కేసు, రాజస్థాన్ మైనింగ్ లీజు సమస్య, దివాలా చట్టం కింద లిక్విడేషన్ ప్రొసీడింగ్స్‌పై నిబంధనలు వంటి కేసుల‌పై ఛీప్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వములో తీర్పులు వెలువరించనున్నారు.