సీనియర్ హీరో నాగార్జున చేస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఆసియన్ సునీల్ అండ్ కో నిర్మాతలు. ఈ సినిమా ట్రయిలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ లైన్ లో విడుదల చేసారు.
తను ఇచ్చిన మాట కోసం ఓ అమ్మాయిని కాపాడే రక్షకుడిగా నాగార్జున ట్రయిలర్ లో కనిపించాడు. ఫుల్ యక్షన్ మోడ్ లో వుండే ఫెరోషియస్ క్యారెక్టర్ లా కనిపిస్తోంది.
ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ ఎవరు? అతగాడు తండ్రికి ఇచ్చిన మాట, సోదరి,మేనకోడలు ను కాపాడుకోవడం, వారికి వచ్చిన ముప్పు ఇవన్నీ కలిపి స్టోరీ లైన్. కేవలం యాక్షన్ సినిమాగా కాకుండా కాస్త ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా అద్దినట్లు కనిపిస్తోంది. నాగార్జున సినిమాలకు అవసరమైన రొమాంటిక్ టచ్ కూడా ట్రయిలర్ లో కనిపించింది. అందుకోసమే సోనాలి చౌహాన్ ను తీసుకున్నట్లు కనిపిస్తోంది.
వన్ లైన్ గా చెప్పుకుంటే స్టోరీ లైన్ చిన్నది కనుక, ట్రయిలర్ లో యాక్షన్ సీన్లు బాగా పరుచుకున్నట్లు కనిపిస్తోంది. యాక్షన్ సీన్లు అన్నీ హై క్వాలిటీ స్టాండర్డ్ తో, వైవిధ్యంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. సాంకేతిక విలువలు, నిర్మాణ విలువలు బాగున్నాయి.