అమెరికాలోని తెలుగువారి సంస్థ తానా. ఏటా జరిగే తానా సభలకు సినిమా, రాజకీయ, సామాజిక ప్రముఖులు పలువురికి ఆహ్వానాలు అందుతుంటాయి. కొంతమంది రావడం సభలకు అట్రాక్షన్ గా వుంటుందని, కొంతమంది రావడం గౌరవంగా వుంటుందని, కొంతమందిని గౌరవించడం అవసరం అని, ఇలా రకరకాల ఈక్వేషన్లు కారణాలు ఈ ఆహ్వానాల వెనుక వుంటాయి.
ఈసారి తానా సభలకు క్రేజీ సెలబ్రిటీలు మరీ ఎక్కువగా లేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణ అనుకోవాలి. అల్లరి నరేష్, నారారోహిత్, సునీల్ లాంటి హీరోలు, మాత్రమే వస్తున్నారు. మహిళా సినిమా సెలబ్రిటీలు మరీ తక్కువ. కమిలినీ ముఖర్జీ లాంటి మాజీ హీరోయన్ మాత్రమే వస్తున్నారు.
గాయని సునీత, యాంకర్ సుమ జాబితాలో వున్నారు. వీరిలో సుమ ఒక్కరే ఫుల్ బిజీగా వున్న సెలబ్రిటీ. టోటల్ జాబితాలో ఎవరు ఇప్పుడు క్రేజీగా వున్నారో అన్నది జనాలకు తెలిసిందే. టాప్ సెలబ్రిటీల పేర్లు అయితే అయితే ప్రస్తుతానికి వినిపించడం లేదు.
ప్రస్తుతం యువ హీరోల్లో ఫుల్ క్రేజ్ వున్న విజయ్ దేవరకొండను ఎలాగైనా తానా సభలకు రప్పించాలని నిర్వాహకులు వారి లోకల్ పరిచయాల ద్వారా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ విజయ్ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. తనకు వ్యక్తిగత, ఫ్యామిలీ పనులు వున్నాయని, రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ను నేరుగా కాకుండా, లోకల్ గా కొంతమంది ద్వారా కాంట్రాక్టు చేసినట్లు బోగట్టా.
ఇదిలావుంటే ఇటీవల తెలుగుదేశం నుంచి భాజపాలో జంప్ చేసిన సిఎమ్ రమేష్, టిజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఆహ్వనితుల జాబితాలో వున్నారు. మరి మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు హాజరవుతారో లేదో చూడాలి.