కరోనా రెండో ఫేజ్ తరువాత వస్తున్న సినిమాల మీద డిస్ట్రిబ్యూటర్ల దృష్టి కాస్త గట్టిగానే వుంది. ఇన్ సైడ్ టాక్ ఏమాత్రం బాగున్నా ట్రేడింగ్ అయిపోతోంది.
ఎస్ ఆర్ కళ్యాణమండపం (est 1975) అనే చిన్న సినిమా ఇలాగే నక్క తోక తొక్కింది. సినిమా అమ్మకాలు భలేగా జరిగిపోయాయి. ఇది కాస్త ఆశ్చర్యంగా వుండే విషయమే. ఆంధ్ర 2.80 కోట్ల రేషియోలో, నైజాం 1.08 కోట్లకు విక్రయించేసారు. దాంతో ఆగస్టు 6 ను విడుదల డేట్ గా ప్రకటించేసారు.
రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ – రాజు నిర్మాతలుగా.. నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన సినిమానే ఈ ఎస్ ఆర్ కళ్యాణమండంపం .
ఆ మధ్య విడుదల చేసిన చుక్కల చున్ని, చూసాలే కళ్లార వంటి పాటలు యూట్యూబ్ లో మిలయన్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అయ్యాయి. దాంతో మార్కెటింగ్ ఈజీ అయింది. .
కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.