సినిమా టైటిల్ శాకిని..ఢాకిని…డైరక్టర్ సుధీర్ వర్మ. కానీ ఇక్కడే చిన్న గమ్మత్తు వుంది. ఇప్పుడు ఆ సినిమా సుధీర్ వర్మ సినిమా కాదు. పెద్దగా కన్ ఫ్యూజన్ ఏమీ లేదు. నిర్మాతకు..డైరక్టర్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఇలాగే వుంటుంది. అందులోనూ దగ్గుబాటి సురేష్ బాబుతో వ్యవహారం అంటే ఇలాగే వుంటుంది. ఇలా కొత్త గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో.
విషయం ఏమిటంటే మిడ్ నైట్ రన్నర్స్ అనే విదేశీ సినిమా ఐడియాను పట్టుకువచ్చి శాకిని ఢాకిని సినిమా ప్లాన్ చేసారు దగ్గుబాటి సురేష్ బాబు, గురు ఫిలింస్ కలిసి. దర్శకుడిగా సుధీర్ వర్మను తీసుకువచ్చారు. వాళ్ల ఐడియా ఈయన ఎగ్జిక్యూషన్ తో సినిమా రెడీ అయింది. కానీ అక్కడే ఎందుకో సురేష్ బాబుకు నచ్చలేదని బోగట్టా.
అర్జంట్ గా మళ్లీ చాలా వరకు తీయాలి అనుకున్నారు. ఆ టైమ్ కు సుధీర్ వర్మ రెండు సినిమాల్లో బిజీ అయిపోయారు. కాస్త గ్యాప్ తరువాత చేస్తా అన్నారు. అంత వరకు వెయిటింగ్ నా అంటూ మరో డైరక్టర్ ను రంగంలోకి దింపేసారని తెలుస్తోంది. ఆ విధంగా సుధీర్ వర్మ సినిమా కాస్తా మరో డైరక్టర్ సినిమాగా మారిపోయిందని బోగట్టా.
కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ శాకినీ ఢాకినీ సినిమాలో నివేదా, రెజీనా కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరి ఇంతకీ ఈ సినిమాలో సుధీర్ వర్మ చేసిన షూట్ ఎంత మేరకు వుంచారో? వేరే దర్శకుడు చేసింది ఎంత వరకు తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.