కేంద్ర హోం మంత్రి అమిత్ షా- హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటి అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దూమారం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రా రాజకీయాల్లో ఇరువురి డిన్నర్ డిస్కషన్ పై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ఇవాళ ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి ఈ బేటిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ తిరుపతిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ లక్ష్మీ పార్వతి ఆకాంక్షించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవాంటూ లక్ష్మీ పార్వతి సూచించారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పగ్గలు చేపట్టడం తన కోరిక అంటూ లక్ష్మీపార్వతి పేర్కోన్నారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని గుర్తుచేస్తూ చంద్రబాబు నుండి పార్టీని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ పార్టీని సమర్థవంతంగా నడిపించలరంటూ లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. కాగా.. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టీడీపీలో ఒక వర్గం వారు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు.
ఎన్టీఆర్-షా బేటి తర్వాత టీడీపీ దాని అనుకూల మీడియా ఏ విధంగా ఆర్థం చేసుకోలేకపోతోంది. టీడీపీని భూస్థాపితం చేయాడానికి బీజేపీ సిద్ధం చేస్తున్న ఆయుధంలా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.