వివాదాస్పద విమర్శకుడు, సినీ విశ్లషకుడు, సినిమానటుడు, సినిమా దర్శకుడు కత్తి మహేష్ మరణించారు. సోషల్ మీడియాలో సంతాపం తెలిపిన వారు తెలిపారు. అతని మీద కోపం వున్నవారు తమ కసి మరోసారి వెళ్లగక్కారు. నాని లాంటి హీరో ట్విట్టర్ లో సంతాపం తెలిపారు.
టాలీవుడ్ తాజా పెద్దరికం తన స్వంత చేసుకున్న లేదా చేసుకోవాలనుకుంటున్న మెగాస్టార్ మాత్రం ఓ ట్వీట్ వేయలేకపోయారు. కత్తి మహేష్ గురించి ఏ విశ్లేషణలు వాడనక్కర లేదు. జస్ట్ ఆత్మ శాంతించాలని చిన్న మాట అని వుండొచ్చు. కానీ అలా కూడా చిరు అనలేకపోయారు.
పవన్ ను కీలక సమయంలో కత్తి మహేష్ తీవ్రంగా విమర్శించారు. అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ కు కత్తి మహేష్ కు బద్ద వైరం వుంది. గతంలో ఆయనపై దాడి చేసారని కూడా వార్తలు వచ్చాయి.
బహుశా ఇప్పుడు తాను ట్వీట్ వేస్తే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహిస్తారని చిరు భయపడ్డారని అనుకోవాలేమో? నిజానికి పెద్దరికం నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు పెద్దమనిషి తరహాగా వ్యవహరించాలి. కానీ చిరు అలా చేయలేకపోయారేమో?