ఎన్టీఆర్ ను షా అవ‌మానించారా!.. ప‌వ‌న్

విన‌డానికి కాస్తా వింతగా ఉన్నా టాలీవుడ్ హీరో క‌మ్ పోలిటిష‌న్ బాష‌లో చెప్ప‌లంటే ఎన్టీఆర్ ను అమిత్ షా అవ‌మానించారు అని అనుకోవాలి. ఎందుకంటే అమిత్ షా ముందు ఎన్టీఆర్ చేతులు క‌ట్టుకొని చాల…

విన‌డానికి కాస్తా వింతగా ఉన్నా టాలీవుడ్ హీరో క‌మ్ పోలిటిష‌న్ బాష‌లో చెప్ప‌లంటే ఎన్టీఆర్ ను అమిత్ షా అవ‌మానించారు అని అనుకోవాలి. ఎందుకంటే అమిత్ షా ముందు ఎన్టీఆర్ చేతులు క‌ట్టుకొని చాల విన‌యంగా కుర్చున్నారు. ఎన్టీఆర్ పోజిష‌న్ లో ఎవ‌రూ ఉన్న ఇలాగే ఉంటారు. పెద్ద‌వారిని గౌర‌వించ‌డం అందులోను కేంద్ర హోం శాఖ మంత్రితో విన‌యంగా ఉండ‌టం త‌ప్పులేదు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాష‌లో టాలీవుడ్ లో పెద్ద హీరో, ఆర్ఆర్ఆర్ సినిమా న‌టుడును చేతులు క‌ట్టుకొని ఎలా కూర్చోబెడతారు అని ఆర్థం.

గ‌త వీకెండ్ పోలిటిక‌ల్ టూర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోటి నుండి ఇలాంటి అణిముత్యాలే వ‌చ్చాయి. ఆంధ్ర‌కు సీఎం కావ‌ల్సిన మా అన్నతో సీఎం జ‌గ‌న్ న‌మ‌స్కారం పెట్టించుకున్నారు అంటూ తెగ బాధ ప‌డిపోయారు. సీఎం జ‌గ‌న్ మోగాస్టార్ ను ఎంతో ప్రేమ‌తో మంచిగా మాట్లాడారు కానీ అవి ప‌వ‌న్ కు క‌న‌ప‌డలేదు. మా అన్న‌ను అవ‌మానించారు అని తెగ బాధ‌ప‌డిపోయారు. 

మునుగోడు స‌భ‌కు వ‌చ్చిన అమిత్ షా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఎన్టీఆర్ ను క‌లిశారు. ఎక్క‌డ ఎన్టీఆర్ ను చిన్న‌ చూపు చూడ‌లేదు. ఏ రాజ‌కీయ నాయ‌కుడు అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్న‌ట్లు ఉండ‌రు. ఎందుకంటే రాజ‌కీయాల‌ల్లో అల ఉంటే వారు ఎద‌గాలేరు. బ‌హుశ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం అయితే త‌న రాష్ట్రంలో అంద‌రూ త‌నకు అమితంగా గౌర‌వం ఇవ్వ‌లాని హుకుం జారీ కూడా చేస్తారేమో.

సంస్కారం అనేది ఇద్దరి మ‌ధ్య ఇచ్చి పుచ్చుకొనే గౌర‌వ సూచిక‌. అమిత్ షా ప్రేమ‌తో పిలుపు చేస్తే గౌర‌వంగా వెళ్లీ అతిథి మర్యాదలు స్వీక‌రించారు. ఏదో రోజు ఈ మీటింగ్ గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మీటింగ్ ల‌ల్లో త‌న‌లో ఉండే భావనలు బ‌య‌ట పెట్టి ఎన్టీఆర్ ను ఆగౌర‌పరిచారు అని కూడా అన్న‌చ్చు.