టీవీ 5 మూర్తి వ్యవహారం వెనుక

ఉన్నట్లుండి నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ఒకటే  హడావుడి. టీవీ 5 మూర్తిని అరెస్టు చేసేస్తారహో అంటూ. ఆ వెంటనే వుయ్ ఆర్ విత్ టీవీ5 మూర్తి అంటూ ట్రెండింగూ. ఏమిటిది? ఆలూ లేదు…

ఉన్నట్లుండి నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ఒకటే  హడావుడి. టీవీ 5 మూర్తిని అరెస్టు చేసేస్తారహో అంటూ. ఆ వెంటనే వుయ్ ఆర్ విత్ టీవీ5 మూర్తి అంటూ ట్రెండింగూ. ఏమిటిది? ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా వుంది వ్యవహారం. చిత్రమేమిటంటే టీవీ 5 వర్గాలకే ఈ వైనం గురించి తెలియదు. కానీ ఈలోగానే వేరే చోట్ల స్క్రోలింగ్ లు, ట్విట్టర్ లో ట్రెండింగ్ లు జరిగిపోయాయి. దీన్ని బట్టుకుని వార్తలు రాసేవాళ్లు రాసేసారు.

ఏమిటిదంతా అని టీవీ 5 వర్గాలనే బుధవారం రాత్రి వేళ అడిగితే తమకే తెలియదన్నట్లు సమాధానం. ఇంకా చిత్రమేమిటంటే, అసలు టీవీ 5 మూర్తిని ఎందుకు అరెస్టు చేస్తారు? అన్నది ఈ సో కాల్డ్ ట్రెండిగ్ జనాలకు కానీ, దానిని బట్టుకుని కథనాలు అల్లేసిన వాళ్లకు కానీ తెలియనే తెలియదు. వుయ్ స్టాండ్ విత్ మూర్తి అంటే వుయ్ స్టాండ్ విత్ మూర్తి అనేయడమే.

విషయం ఏమిటంటే, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ లేఖ వ్యవహారాన్ని సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ లేఖ మీడియాకు ముందుగా లీక్ అయింది. ఎలా లీక్ అయిందన్న దానిపై దర్యాప్తు సాగుతోంది. టీవీ 5 లో కూడా లేఖ ముందుగా వచ్చింది. అదెలా వచ్చింది? అనే విషయమై టీవీ 5 మూర్తిని సిఐడి బృందం క్వశ్చను చేయబోతోంది అన్నది ముందుగా బయటకు పోక్కింది. 

ఇదే జరిగితే సహజంగా మీడియా తన సోర్స్ లు చెప్పాలని నిబంధన ఏదే లేదు. అనే క్లాజ్ ఆధారంగా మూర్తి తప్పించుకునే అవకాశం వుంది. కానీ ఆ క్రమంలో లేనిపోని తలకాయనొప్పులు వచ్చే అవకాశం వుంది. అందుకే అసలు ముందుగానే, ఎవరూ కొట్టకుండానే, బాబోయ్..కొట్టేస్తున్నారు అని అరిచేస్తే పోలా? అదీ స్ట్రాటజీ పన్నేసారు ఎవరు పన్నారు..ఎవరు సోషల్ మీడియాలో హడావుడి చేసి వుంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

అర్జెంట్ గా టీవీ 5 మూర్తిని అరెస్ట్ చేసి, జనం దృష్టిలో అతన్ని హీరోను చేసి, తాను విలన్ గా మారేంత సెల్ఫ్ గోల్ జగన్ ప్రభుత్వం చేస్తుంది అని అనుకోవడానికి లేదు. చిత్రమేమిటంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ను పరోక్షంగా కేసిఆర్ బాహాటంగా హెచ్చరించారు. ఆ పత్రికలో వచ్చిన వార్తలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, తాట తీస్తా అనే లెవెల్ ను హెచ్చరించారు. కానీ అప్పుడు ఎవ్వరూ వుయ్ స్టాండ్ విత్ ఆర్కే అని కానీ, వుయ్ ఆర్ విత్ ఆర్కే అని కానీ అనలేదు పాపం. 

మొత్తం మీద టీవీ 5 మూర్తి ఇప్పుడు హీరో అయ్యారు. కానీ జర్నలిస్ట్లులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. లీగల్ గా దొరకనంత వరకే. దొరికితే ఎవ్వరూ ఆదుకోరు. టీవీ 9 రవిప్రకాష్ ఇప్పుడు ఎక్కడున్నారు? శివాజీ ఎక్కడున్నారు? ఇలా ఈ జాబితా చాలా వుంది. అందువల్ల ఎవరైనా ఓ లెవెల్ వరకే ఎగరాల్సి వుంటుంది. అది దాటి ఎగిరితే ఇలాంటి ఇబ్బందులే చుట్టుముట్టే అవకాశం వుంది. ఈ ట్రెండింగ్ లు, ఈ వ్యవహారాలు ఆదుకుంటాయి అనుకుంటే భ్రమే. ఎవరి జాగ్రత్తలే వారిని ఆదుకునేవి అని గమనించాలి.

హెరిటేజ్ లో ఎంతమందికి కరోనా వచ్చింది?