సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా పుష్ప. అడవుల బ్యాక్ డ్రాప్ లో కలప స్మగ్లింగ్ మీద అల్లుకున్న కథ అని ఇఫ్పటికే వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ కాగానే ప్రారంభమయ్యే ఈ సినిమాలో భారీ ఫైట్లు, భారీ ఛేజ్ వుంటాయట. ఇంతకు ముందు ప్లాన్ లు అయితే వేరు. ఫైట్ల కోసం విదేశీ టెక్నీషియన్లు వాడాలని అనుకున్నారు.
కానీ కరోనా కారణంగా మొత్తం ప్లాన్లు మారిపోయాయి. దేశీయ ఫైట్ మాస్టర్లనే ఎంగేజ్ చేయబోతున్నారు. ఇండియన్ టాప్ ఫైట్ మాస్టర్ల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ డేట్ లు ఇమ్మీడియట్ గా కేటాయించడం కూడా కీలకం. పీటర్ హైన్స్, కణల్ కన్నన్ ఇలా చాలా మంది పేర్లు పరిశీలనలో వున్నాయి.
ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమా వార్ కు పని చేసిన ఫైట్ మాస్టర్ల పేరు కూడా పరిశీలనలో వుంది. ఆ సినిమాలో యాక్షన్ సీన్లకు మంచి పేరు వచ్చింది. అందుకే ఆ దిశగా ఆలోచిస్తున్నారు.
ఇదిలా వుంటే అడవిలో హీరో లారీ తోలుతూ భారీ ఛేజ్ కూడా వుందట సినిమాలో. అది చాలా కీలకం అని తెలుస్తోంది. అందుకే దీని చిత్రీకరణకు కాస్త భారీగానే ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ ఛేజ్ కు విదేశీ టెక్నీషియన్లను వాడదాం అనుకున్నారు కానీ, ఇప్పుడు ఆ ఆలోచన మారి, వేరే వాళ్లవైపు చూస్తున్నారు దర్శకుడు సుకుమార్.