తొలిప్రేమ అనుభూతుల్ని ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోలేరు. అదో అందమైన అనుభవం. ప్రతి వ్యక్తి జీవితంలో ఫస్ట్ క్రష్ ఉంటుంది. హీరోహీరోయిన్లు కూడా దీనికి అతీతం కాదు. తమ లైఫ్ లో ఫస్ట్ క్రష్ గురించి మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి కొంతమంది హీరోలు పలుమార్లు బయటపెట్టారు. అలాంటి స్టార్లు తొలిసారి ప్రేమలో పడిన సంగతులు తెలుసుకుందాం.
ఊహ తెలిసిన తర్వాత మహేష్ బాబు ఫస్ట్ క్రష్ హాలీవుడ్ నటి డెమీ మూర్. ఆమె అంటే మహేష్ కు పిచ్చి. ఆ ఫస్ట్ క్రష్ తర్వాత 26 ఏళ్ల వయసులో తొలిసారి మరో అమ్మాయితో ప్రేమలో పడ్డానని.. ఆ తర్వాత ఆమెనే (నమ్రత) పెళ్లి చేసుకున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు మహేష్.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. బయట కూడా వీళ్లు మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్నేహితుల ఫస్ట్ క్రష్ కూడా ఒకరే. ఆమె మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమెను చూస్తుంటే అన్నీ మరిచిపోతానని అంటుంటాడు ఎన్టీఆర్. రామ్ చరణ్ ది కూడా ఆల్ మోస్ట్ ఇదే ఫీలింగ్. చిన్నప్పుడు శ్రీదేవిని తెగ ఇష్టపడ్డాడట ఈ హీరో.
పుష్ప అలియాస్ అల్లు అర్జున్ కు కూడా ఫస్ట్ క్రష్ ఉంది. బన్నీకి ఐశ్వర్యారాయ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆమెను చూసి తొలిసారి ప్రేమలో పడ్డాడట. ఆమె కోసం ఆమె నటించిన సినిమాలన్నీ చూశాడంట ఈ హీరో.
ఇక బాహుబలి ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఆమె క్లాస్ టీచర్. చిన్నప్పుడు చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు ఆమె క్లాస్ టీచర్ ను చూసి ఫస్ట్ టైమ్ ప్రేమలో పడ్డాడట ప్రభాస్. ఇప్పటికీ తనకు ఆ ఫీలింగ్ గుర్తుందని చెబుతుంటాడు.
సూర్య ఫస్ట్ క్రష్ అయితే ఏకంగా సినిమా స్టోరీనే. తన జీవితంలో ఫస్ట్ టైమ్ చెన్నై నుంచి కోయంబత్తూరుకు విమానంలో వెళ్లాడు సూర్య. తనకు వరసయ్యే బంధువు పెళ్లి అది. సూర్య కంటే ఆమె ఆరేళ్లు పెద్ద. ఆమె అంటే సూర్యకు క్రష్ ఉండేది. అలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే తట్టుకోలేకపోయాడట. పెళ్లి కొడుకును కూడా అమ్మాయి పక్కన కూర్చోనివ్వలేదట.