అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్.. ఏం జ‌రుగుతోంది?

మునుగోడులో స‌మ‌ర‌భేరి స‌భ‌కు ముఖ్య అతిథిగా వ‌స్తున్న అమిత్ షా… ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం నోవాటెల్ లో ఆమిత్ షా తో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున‌ట్లు…

మునుగోడులో స‌మ‌ర‌భేరి స‌భ‌కు ముఖ్య అతిథిగా వ‌స్తున్న అమిత్ షా… ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం నోవాటెల్ లో ఆమిత్ షా తో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున‌ట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సైడ్ నుండి ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన త‌ర్వాత అమిత్ షా ఎన్టీఆర్ న‌ట‌న న‌చ్చి ప్ర‌తేక్యంగా డిన్న‌ర్ మీట్ కు అహ్వానించిన‌ట్లు చెప్పుతున్నారు. మ‌రోవైపు పొలిటికల్ లో స‌ర్కిల్ లో మాత్రం బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగా స‌మావేశం అవుతున్న‌ట్లు చ‌ర్చించుకుంటున్నారు.

ఈ అనూహ్య ప‌రిణామంతో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎన్టీఆర్- షా బేటి జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌తేక్య దృష్టి పెట్టింద‌ని అంద‌రికి తెలిసిందే. 

ఈ భేటి త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిణామాలు చాల జ‌ర‌గ‌వ‌చ్చ‌ని బీజేపీ వ‌ర్గాల నుండి వ‌స్తున్నా మాట‌లు. ఈ భేటి అయితే నిజంగా పెద్ద స‌స్పెస్స్ గా క‌నిపిస్తోంది.