విద్యా మంత్రిగా బొత్స ఫెయిలేనా…?

విపక్షాలు అయితే బొత్స సత్యనారాయణ సీనియర్‌ మంత్రిగా ఉండి కూడా తన శాఖను సమర్ధంగా నిర్వహించలేకపోతున్నారు అని విమర్శలు చేస్తూ వస్తున్నారు.  Advertisement బొత్స కాకలు తీరిన రాజకీయ నాయకుడు. అంతే కాదు పలు…

విపక్షాలు అయితే బొత్స సత్యనారాయణ సీనియర్‌ మంత్రిగా ఉండి కూడా తన శాఖను సమర్ధంగా నిర్వహించలేకపోతున్నారు అని విమర్శలు చేస్తూ వస్తున్నారు. 

బొత్స కాకలు తీరిన రాజకీయ నాయకుడు. అంతే కాదు పలు శాఖలను అవలీలగా చూసిన అనుభవం కలిగిన వారు. అలాంటి బొత్స సత్యనారాయణ మునిసిపల్‌ శాఖ మంత్రిగా జగన్‌ మంత్రివర్గంలో ఉన్నపుడు ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చేవారు. ముచ్చటించేవారు. తన శాఖకు సంబంధించిన విషయాలను కూడా ప్రకటించేవారు. అలాంటి ఆయనను విద్యాశాఖ మంత్రిగా చేస్తే మాత్రం గప్‌చిప్‌ అయ్యారు. 

ఆయనకు ఈ శాఖ ఇష్టంలేదని మొదటి నుంచి ప్రచారంలో ఉన్న విషయమే. అయితే ఆయన బాధ్యతలు తీసుకున్నాక విద్యాశాఖ గాడిన పడుతుందని అంతా అనుకుంటే రివర్స్‌గా కధ సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖలోనే వివాదాలు రాజుకుంటున్నాయి. 

గురువులే బయటకు వచ్చి సర్కార్‌ మీద విమర్శలు చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు మీద ఆందోళనలోనూ వారే ముందున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా ముఖ ఆధారిత హాజరీ అంటూ యాప్‌ను తీసుకువస్తే దానిని కూడా తోసిపుచ్చుతున్నారు. 

మేము ఇలాగే ఉంటామని ఖండిరతంగా చెబుతున్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలలను విలీనం చేస్తూ ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తే దాని మీద కూడా ఉద్యమిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులకు సమస్యలు ఉండవచ్చు కానీ వారు ఇలా ఎదురుతిరగడం అన్నది గతంలో పెద్దగా జరగలేదు. 

ఈ విషయంలో వారికి ఉన్న అభ్యంతరాలను తెలుసుకుని సరిచేయాల్సిన మంత్రి బొత్స నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. పైగా బొత్స మేము ఇలాగే చేస్తామంటూ రెచ్చగొట్టే ప్రకటనలు కూడా చేయడం వల్ల సమస్య మరింతగా రాజుకుంటోందని అంటున్నారు. మొత్తానికి బొత్స విద్యా శాఖ మంత్రిగా ఫెయిల్‌ అయ్యారని అంతా అంటున్నారుట.