వైసీపీకి టీడీపీ ఫ్రీ పబ్లిసిటీ

కరోనా కష్టకాలంలో వైసీపీ నేతలకు ఉచిత పబ్లిసిటీ ఎక్కువైంది. పార్టీ సొంత మీడియా కంటే ఎక్కువగా.. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా ఆ పనిచేసి పెడుతోంది. వైసీపీని విమర్శించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ…

కరోనా కష్టకాలంలో వైసీపీ నేతలకు ఉచిత పబ్లిసిటీ ఎక్కువైంది. పార్టీ సొంత మీడియా కంటే ఎక్కువగా.. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా ఆ పనిచేసి పెడుతోంది. వైసీపీని విమర్శించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ప్రచారం.. చివరకు వైసీపీ నేతలకే అనుకూలంగా మారడంతో పచ్చపార్టీ నేతలు అవాక్కవుతున్నారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వైసీపీ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారనే భావన అంతటా ఏర్పడింది. దీనికి పరోక్ష కారణం టీడీపీయే.

కరోనా టైమ్ లో ఎమ్మెల్యే రోజాపై పూలు చల్లారని అదేదో పెద్ద నేరమైనట్టు వీడియో పోస్ట్ చేసి విమర్శించారు టీడీపీ నేతలు. వాస్తవానికి తాగునీటి కోసం ఏళ్ల తరబడి కష్టాలు పడుతున్న స్థానికులకు ఎమ్మెల్యే రోజా దేవతలా కనిపించారు. తమ కష్టాలు తీర్చినందుకు ఆమెపై పూలు చల్లి అభిమానం చూపించారు. అసలు విషయం బైటపడే సరికి రాష్ట్రవ్యాప్తంగా రోజాకు ప్రశంశలు లభించాయి. దీంతో టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు.

ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యవహారం కూడా అంతే. టీడీపీ ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు మధుసూదన్ రెడ్డి. వైసీపీ నేతలకు, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళాలు ప్రకటించినవారికి ఆయన అభినందనలు తెలిపిన తీరుని అందరూ మెచ్చుకున్నారు. రాజకీయాలకు అతీతంగా చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా టీడీపీ తప్పుపట్టడం వారికే రివర్స్ లో తగిలింది.

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ సేవా కార్యక్రమాలు కూడా టీడీపీ చేసిన వ్యతిరేక ప్రచారం వల్లే బాగా ఫేమస్ అయ్యాయి. కరోనా కాలంలో ఎమ్మెల్యే రజినీ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారడానికి టీడీపీయే కారణం. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని, విశాఖలో ఎంపీ, ఎమ్మెల్యేలు మీటింగ్ లు పెట్టారని, మిగతా జిల్లాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గీతదాటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారనేది టీడీపీ నేతల ఏడుపు. ఇలా వైసీపీ నేతలంతా నిత్యం ప్రజల్లో ఉంటున్నారనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.

దీంతో ఒకరకంగా ఇది వైసీపీ నేతలకు వరంగా మారింది. టీడీపీ చేస్తున్న విష ప్రచారం వారికే రివర్స్ లో తగిలింది. టీడీపీ నేతలు ప్రజల్లోకి రాకుండా ఉండటం ఒక తప్పయితే.. కరోనాని సైతం లెక్కచేయకుండా ప్రజల్లో తిరుగుతూ, వారి కష్టాలు వింటున్న వైసీపీ నేతల్ని విమర్శించడం మరో తప్పు. ఈ రెండు తప్పుల్నీ సక్సెస్ ఫుల్ గా చేసిన టీడీపీ ఓవరాల్ గా సెల్ఫ్ గోల్ చేసుకుంది. 

హెరిటేజ్ లో ఎంతమందికి కరోనా వచ్చింది?