పంచభూతాల పంచ్ రివర్స్ …

కాదేదీ విమర్శలకు అతీతం అన్నదే రాజకీయ పాలసీ. ఆ విషయంలో తలపండిన తెలుగుదేశం ఇపుడు బాక్సైట్ తవ్వకాలు, వేల కోట్ల లూటీ అంటూ అధికార పార్టీ మీద విరుచుకుపడుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ…

కాదేదీ విమర్శలకు అతీతం అన్నదే రాజకీయ పాలసీ. ఆ విషయంలో తలపండిన తెలుగుదేశం ఇపుడు బాక్సైట్ తవ్వకాలు, వేల కోట్ల లూటీ అంటూ అధికార పార్టీ మీద విరుచుకుపడుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ సీన్ లోకి వచ్చారు. 

మొత్తం అయిదేళ్ల టీడీపీ ఏలుబడిలో జరిగిన నేరాలూ ఘోరాలూ చిట్టా చదివేశారు. మీ హయాంలో పంచభూతాలను కూడా పంచేసుకున్నారు కదా బాబూ అంటూ రివర్స్ లో గట్టి పంచులే వేశారు.

చీమకుర్తి ఖనిజాలతో మొదలెట్టి పదమూడు జిల్లాలలో ఇసుక దందాల దాకా సర్వం దోచుకున్నారు కదా అంటూ గుడివాడ బాగానే కడిగేశారు. అంతే కాదు, విశాఖలో బాక్సైట్ గనులను తవ్వేసి దోచుకోబట్టే కదా 23 సీట్లకు పడిపోయారు అంటూ గట్టిగానే సెటైర్లు వేశారు.

ఇక మూడేళ్ళ క్రితం టీడీపీ ఎమ్మెల్యే విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల చేతిలో హతం కావడం వెనక పాపం ఎవరిది బాబూ అంటూ గుడివాడ నిలదీశారు. కేవలం రెండు ఎకరాలతో ఉన్న బాబు ఈ రోజు రెండు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో ఒక్క మైనింగ్ లీజ్ కూడా ఇవ్వలేదని చెప్పిన ఆయన లైట్ రైట్ తవ్వకాల్లో టీడీపీ నేతలే ఉన్నారని గుట్టు విప్పేశారు. ఏకంగా కోర్టుకెళ్ళి మరీ లైట్ రైట్ తవ్వకాల మీద ఆర్డర్లు తెచ్చుకున్నది తమ్ముళ్ళు కాదా బాబూ అంటున్నారు గుడివాడ. మొత్తానికి బాక్సైట్ పేరిట యాగీ చేయాలనుకున్న టీడీపీకి గుడివాడ స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారుగా.