ఆయన వైసీపీలో యువ మంత్రి. జగన్ మెచ్చిన మంత్రి కూడా. మూడున్నర పదుల వయసులోనే కీలకమైన అయిదు శాఖలకు ఎకాఎకిన మినిస్టర్ అయిపోయారు.
ఒక విధంగా ఆయనకు ఇది రాజకీయ సిరిగా అంతా చెబుతారు. ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్. ఆయన మాటలు సూటిగా ఉంటాయి. అలాగే పొలిటికల్ పంచుల స్పెషలిస్ట్ గా పేరు గడించారు.
విపక్షాలను ప్రత్యేకించి చంద్రబాబు, పవన్ ల మీద ఒక రేంజిలో కామెంట్స్ చేయాలంటే గుడివాడ సరిజోడు అని అంతా అనుకునే విధంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ యువ మంత్రి సడెన్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఎందుకంటే ఆయన తాజాగా ఫోటో షూట్ పెట్టారు. తనను తాను వివిధ ఫోజులలో ఫోటోలు తీయించుకుంటూ ఆయన హడావుడి మొదలెట్టారు.
దీన్ని చూసిన వారు మంత్రి గారు ఎందుకు ఇంతలా హల్ చల్ చేస్తున్నారు అని నెట్టింట సాక్షిగా క్వశ్చినింగ్ చేస్తున్నారు. అయితే ఈ భారీ పరిశ్రమల మంత్రి ఇలా ఫోటోలకు వరస ఫోజులు ఇస్తూ షూట్ చేయడం వెనక ఎన్నికలు ఎపుడు వచ్చినా తన ఫోజులను జనాలల్లోకి వదిలి అలా ప్రచారాన్ని చేసుకోవచ్చనే ముందస్తు కసరత్తు ఉందని చెబుతున్నారు.
అయితే గుడివాడ ఏ ఉద్దేశ్యంతో ఇలా చేశారో పక్కాగా తెలియదు కానీ ఆయన మాత్రం సోషల్ మీడియాలో కామెంట్స్ కి గురి అవుతున్నారు. మరి గుడివాడ హడావుడి వెనక అసలు విషయం ఏంటో ఆయనే చెప్పాలి.