రాష్ట్రంలో జగన్, తెలంగాణలో భాజపా కలిసి రెడ్డి-బిసి మిక్స్ డ్ రాజకీయం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ కు కూడా కమ్మ-కాపు కలిపి రాజకీయం చేయాలని కోరిక.
ఎప్పటి నుంచో ఈ మైండ్ సెట్ తోనే కులాలు కలిసే రాజకీయం చేస్తా అంటున్నారు. కమ్మ-కాపు కలవడం అంటే విజయనానికి దారి వేసుకోవడమే అని ఆయన భావిస్తున్నట్లు అర్థం అవుతూనే వుంది. ఆయన సంగతి ఎలా వున్నా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2014లో తాము గెలవడానికి 2019లో ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ తమతో వుండడం, లేకపోవడమే అన్న భావనకు వచ్చేసింది. అందుకే పవన్ ను మళ్లీ దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పవన్ కు వున్న ఓట్ బ్యాంక్ రెండు విధాలుగా వుంది. ఒకటి కాపు యువత. రెండవది సినిమా అభిమాన యువత. తెలుగుదేశంతో కలిస్తే ఈ రెండు ఓట్ బ్యాంక్ లు కూడా తెలుగుదేశానికి ఓటేయాల్సి వుంది. కానీ అలా వేస్తారా? అన్నది అనుమానం.
ఎందుకంటే కోస్తా జిల్లాల్లో కమ్మ-కాపు కలవడం అన్నది కాస్త అసాధ్యమైన సంగతి. పోనీ ఈ సారి ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలనే పట్టుదల కమ్మ వారిలో వుంది కనుక జనసేన లేదా తేదేపా తరపున ఎవరు నిల్చున్నా ఓటేస్తారని భావించవచ్చు.
కానీ ఇక్కడ మరో ముచ్చట కూడా వుంది. నిన్నటికి నిన్న సర్కారువారి పాట సినిమా 100 రోజుల సందర్భంగా స్పెషల్ షో వేసారు. అక్కడ ఎవరో పవన్ ఫ్యాన్ వచ్చాడట. జనసేన జై అనో, పవన్ పాట హమ్ చేయడమో ఏదో చేసాడట. ఆ ఫ్యాన్ ను చొక్కా విప్పి మరీ ఓ రౌండ్ వేసారట మహేష్ ఫ్యాన్స్. దీన్ని ఘనంగా వీడియో తీసి మరీ ట్విట్టర్ లో పెట్టారు.
మరి ఇలా ఇటు పవన్ ఫ్యాన్స్- అటు మహేష్ ఫ్యాన్స్ అతి చిన్న విషయానికే కొట్టేసుకుంటూ వుంటే, ఓట్ల ట్రాన్స్ ఫార్మేషన్ సాధ్యమేనా? జై జనసేన అనే నినాదాన్నే భరించలేని మహేష్ ఫ్యాన్స్ రేపు ఎన్నికల్లో పవన్ కు లేదా పవన్ పార్టీకి ఓటేస్తారా? వారు కాపులైనా కావచ్చు. కమ్మవారైనా కావచ్చు. మరెవరైనా కావచ్చు.
ఇదే తరహా ప్రభాస్ ఫ్యాన్స్ కు పవన్ ఫ్యాన్స్ కు మధ్య వుంది. ఇదే తరహా పోటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో కూడా వుంది. ఇవన్నీ అధిగమించాల్సి వుంది. మహేష్ బావ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ స్వయానా తెలుగుదేశం పార్టీ మరి ఆ పార్టీతో పవన్ జతకడితే యాంటీ ఫ్యాన్స్ ఓట్లు వెళ్తాయా? చిన్న పాయింట్ కే ఫ్యాన్ ను మరో ఫ్యాన్ చితకకొట్టి ఘనంగా ట్విటర్లో పెట్టడం అంటే పోలిటికల్ గా ఆలోచించే అవసరం లేదు అని అనగలమా?