టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ చాలా రోజుల తరువాత ఈ రోజు సమావేశం అయింది.
సినిమాల పరిస్థితి, విడుదలలు, టికెట్ రేట్లు, డిటిఎస్ ఇలా పలు విషయాలపై డిస్కషన్లు సాగించారు ఈ సందర్భంగా ఆంధ్ర సిఎమ్ జగన్ గురించి ఆసక్తికరమైన డిస్కషన్ గిల్డ్ లో చోటుచేసుకుందని బోగట్టా.
ఇన్నాళ్లూ జగన్ తో మనకేం పని అన్నట్లు ఇండస్ట్రీలో పలువురు వ్యవహరించారని, ఇప్పుడు జగన్ టాలీవుడ్ తో తనకేం పని అన్నట్లు వ్యవహరిస్తున్నారని కొందరు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సిఎమ్ ను ఇతర నాయకులను పదే పదే కలుస్తున్న హీరోలు, టాలీవుడ్ పెద్దలు, జగన్ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించారని కొందరు సభ్యులు అన్నట్లు బోగట్టా.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించినపుడు ఆయనకు భారత రత్న ఇవ్వాలని జగన్ ట్వీట్ చేస్తే, ఒక్క సినిమా సెలబ్రిటీ కూడా స్పందించలేదని ఒకరు అన్నారు.
ఇలా మొత్తం మీద గిల్డ్ సమావేశంలో జగన్ వ్యవహారాలు సెంటర్ పాయింట్ కావడం విశేషం.