నారాయణకు చేదు అనుభవం…?

వామపక్షాలు అంటే ప్రజల పక్షం అంటారు. పైగా రాజకీయ తటస్థ వాదానికి పెట్టింది పేరు. మంచిని మంచిగా చూస్తారని కూడా చెప్పుకునేవారు. కానీ ఇపుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదనుకోవాలి.  Advertisement ఎంతసేపూ రాజకీయ…

వామపక్షాలు అంటే ప్రజల పక్షం అంటారు. పైగా రాజకీయ తటస్థ వాదానికి పెట్టింది పేరు. మంచిని మంచిగా చూస్తారని కూడా చెప్పుకునేవారు. కానీ ఇపుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదనుకోవాలి. 

ఎంతసేపూ రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారు. ఒక సమస్య పరిష్కారానికి మార్గం చూపడం లేదు. సీపీఐ నారాయణ వంటి వారు కూడా ఇపుడు ఇదే తీరులో వెళ్తున్నారా అన్న చర్చ వస్తోంది.

విశాఖలో ఒక వైపు ఉక్కు కార్మికులు తమ సంస్థ ప్రైవేట్ కాబోతోంది అని మండిపోతున్నారు. దాని యజమాని అయిన కేంద్రం ఢిల్లీలో ఉంది. పోరాడితే అక్కడ పోరాడాలి. ఏదైనా మాట అంటే వారినే అనాలి. కానీ చిత్రంగా నారాయణ ఏపీ సర్కార్ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

దాంతో ఉక్కు కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగానే ఖండించాయి. తమకు అందరి మద్దతూ కావాలి. తమ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతుగా ఉన్న వైసీపీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించి రాజకీయం చేద్దామనుకుంటే ఇక్కడ అస‌లు కుదరదు అని కచ్చితంగా చెప్పేశారు.

మీరూ మీరూ రాజకీయాలు వేరే వేదిక మీద చూసుకోండి. ఉక్కు పరిరక్షణకు మాత్రం అంతా కలసి రండి అంటూ గట్టిగానే చెప్పేశారు. దాంతో సీపీఐ నారాయణ టోన్ సవరించుకొవాల్సి వచ్చింది. స్టీల్ ఉద్యమానికి  మద్దతు అంటూ జగన్ మీద విమర్శలు చేయడానికి యత్నించిన నారాయణకు ఇది చేదు అనుభవమే అంటున్నారు.