ఆమె ఓ సీనియర్ హీరోయిన్. ఎన్ని సినిమాలు చేసారన్నది లెక్కా జమా లేదు. అంత సుదీర్ఘమైన కెరీర్. సహజంగా నాలుగు డబ్బులు వెనకేసుకుని, రిటైర్ మెంట్ లైఫ్ హ్యాపీగా గడిపేస్తున్నారు అనుకుంటారు ఎవరైనా.
కానీ పాపం, ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నట్లు తెలుస్తోంది. స్వంత ఇల్లు వున్నా, కరోనా కారణంంగా సినిమాలు లేవు, వేషాలు లేవు. దాంతో సంపాదన లేదు. పిల్లలు చేతికి అంది రాలేదు.
దాంతో సహజంగానే రన్నింగ్ ఇన్ కమ్ అన్నది లేకుండా పోయిందని బోగట్టా. ఆ మధ్య ఓ చిన్న ఆస్తి వివాదంలో చిక్కుకుంటే ఓ సీనియర్ హీరో కలుగ చేసుకుని సెట్ చేసారు.
మరి సుదీర్ఘంగా సాగిన కెరీర్ లో సంపాదించిన డబ్బులు అన్నీ ఏమై పోయి వుంటాయి అని డౌట్ పడితే, స్వంత నిర్మాణం చేపట్టడంతో అందులో ఆవిరైపోయయని సమాధానం వినిపిస్తోంది.
ఏమైనా తెలుగు సినిమా రంగంలో హీరోలు స్థిరపడినట్లు హీరోయిన్లు ఎవ్వరూ సెట్ అయిన దాఖలాలు తక్కువ.