బాబుకు మాధ‌వ్ స‌వాల్‌

టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్ విసిరారు. కాణిపాకం వినాయ‌కుడి వ‌ద్ద శీల ప‌రీక్ష‌కు సిద్ధం కావాల‌ని మాధ‌వ్ కోరారు. అనంత‌పురంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫేక్…

టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్ విసిరారు. కాణిపాకం వినాయ‌కుడి వ‌ద్ద శీల ప‌రీక్ష‌కు సిద్ధం కావాల‌ని మాధ‌వ్ కోరారు. అనంత‌పురంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటోంద‌న్నారు. అది కుదిరే ప‌ని కాద‌న్నారు.

టీడీపీది అన‌వ‌స‌ర రాద్ధాంత‌మ‌న్నారు. ఫేక్ వీడియోతో పాటు దానిపై అమెరికా నుంచి తీసుకొచ్చిన ఫోరెన్సిక్ నివేదిక కూడా ఫేక్ అని తేలిపోయింద‌న్నారు. టీడీపీ వైర‌ల్ చేస్తున్న ఫోరెన్సిక్ స‌ర్టిఫికెట్ తాము ఇచ్చింది కాద‌ని ఎక్లిప్స్ సంస్థ ప్ర‌క‌టించింద‌న్నారు. ఏపీ సీఐడీ చీఫ్ రాసిన లేఖ‌కు ఎక్లిప్స్ సంస్థ అస‌లు వాస్త‌వాలు ఏంటో తెలియ‌జేసిన‌ట్టు మాధ‌వ్ తెలిపారు.  

చివ‌రికి ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను కూడా మార్ఫింగ్ చేసి దొంగ‌లు దొరికిపోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అమెరిక‌న్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్లు అది ఒరిజిన‌ల్ కాద‌ని కుక్క కాటుకు చెప్పు దెబ్బ‌లా నిజం చెప్పార‌న్నారు. శ‌కునం చెప్పే బ‌ల్లి కుడితిలో ప‌డ్డ‌ట్టుగా టీడీపీ ప‌రిస్థితి త‌యారైంద‌న్నారు.

ఫేక్ వీడియోపై మాట్లాడేందుకు బాబు సామాజిక వ‌ర్గం వాళ్లు స‌హ‌క‌రించ‌లేద‌న్నారు. దీంతో త‌మ‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేత‌ల‌ను టీడీపీ  ఆశ్ర‌యించింద‌న్నారు. త‌న‌పై వారు మాట్లాడుతున్నా అభ్యంత‌రం లేద‌న్నారు. వారంతా ఒక్క‌సారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్ర‌బాబుపై ఏబీఎన్‌, టీవీ5, ఈనాడు ఏనాడైనా చ‌ర్చ‌కు పెట్టాయా? అని ప్ర‌శ్నించారు. ఏసీబీ కేసులో దొరికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను తాక‌ట్టు పెట్టి, హైద‌రాబాద్‌ను వ‌దిలి పెట్టుకోవ‌డం ద్వారా ఎంతో న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్ర‌బాబు తేలుకుట్టిన దొంగ‌లా ఆంధ్రాకు ప‌రారై వ‌చ్చాడ‌న్నారు. ఆయ‌న‌పై ఒక్క‌నాడైనా, ఒక్క నిమిష‌మైనా చ‌ర్చ పెట్టాల‌ని ఎల్లో మీడియా చాన‌ళ్ల‌ను అడ‌గాల‌ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు అడ‌గాల‌ని ఆయ‌న సూచించారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చాడ‌ని విమ‌ర్శించారు.

ఆడపిల్ల కనిపిస్తే ముద్దాయినా పెట్టాలి.. లేదంటే కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా ఎందుకు చర్చకు పెట్టలేదు? అని మాధ‌వ్ సంబంధిత వీడియో చూపుతూ నిల‌దీశారు. లోకేశ్‌ అశ్లీల చిత్రాలపై చర్చ ఎందుకు పెట్టరు? అని ప్ర‌శ్నించారు. అలాగే ఫేక్ వీడియో తీసుకొచ్చి బీసీ ఎంపీపై కక్ష సాధిస్తారా? చంద్రబాబు, ఎల్లో మీడియాది కుల దురహంకారం కాదా? అని ఆయ‌న మండిప‌డ్డారు.  

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు మాధ‌వ్ స‌వాల్ విస‌ర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్‌ తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? అని ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రశ్నించారు. పట్టుబడిన రూ.50 లక్షల లంచం తనది కాదని చెప్పగలరా అని నిలదీశారు. చంద్రబాబు మనసూస్పర్తిగా కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాన‌ని సవాల్‌ విసిరారు. 

చంద్రబాబుకు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఫేక్ వీడియో త‌న‌ది కాద‌ని ప్ర‌మాణం చేస్తాన‌ని మాధ‌వ్ అన్నారు. మొత్తానికి ఫేక్ వీడియో వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది.