విశాఖలో పొలిటికల్ పోలరైజేషన్?

నీరు పల్లమెరుగు అంటారు. రాజకీయ జీవులు అధికారం వైపు పరుగులు తీయడం కూడా ఇలాంటి సత్యమే. విశాఖలో తమ్ముళ్ళు కొంతమంది అధికార వైసీపీ టచ్ లోకి వచ్చేశారు.  Advertisement విశాఖలో టీడీపీ 30 మంది…

నీరు పల్లమెరుగు అంటారు. రాజకీయ జీవులు అధికారం వైపు పరుగులు తీయడం కూడా ఇలాంటి సత్యమే. విశాఖలో తమ్ముళ్ళు కొంతమంది అధికార వైసీపీ టచ్ లోకి వచ్చేశారు. 

విశాఖలో టీడీపీ 30 మంది కార్పొరేటర్లను గెలిస్తే అందుకో ఏడుగురు వైసీపీలో చేరాలని గట్టిగా డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సంగతి ఇలా ఉంటే మరెంతమంది కార్పొరేటర్లు అధికార పార్టీ బాట పడతారో అన్న టెన్షన్ పసుపు శిబిరంలో ఉంది. మరో వైపు చూస్తే  కార్పొరేషన్ లో ఈసారి జనసేన, బీజేపీ, వామపక్షాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

మరి బలమైన టీడీపీ కొటలకే  బీటలు వారుతున్న నేపధ్యంలో ఇతర పార్టీల నుంచి అధికార వైసీపీ దిశగా సాగే వారు ఎందరు ఉన్నారు అన్న చర్చ బాగానే  వస్తోంది. 

ఏది ఏమైనా విశాఖ పాలిటిక్స్ లో పోలరైజేషన్ స్టార్ట్ అయింది. అది అధికారం వైపుగా పయనిస్తోంది. రేపటి రోజున ఏ పార్టీలో ఎందరు మిగులుతారు అన్నది పెద్ద డౌటే అంటున్నారు.