గ్రాండ్ గా ఆంధ్రాలో అడుగుపెట్టారు. కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. జాబ్ క్యాలెండర్ పై చేయాల్సిన విమర్శలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై నో కామెంట్ అంటూ తప్పుకున్నారు. ఇలా 2 రోజులుగా హంగామా చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. మరో 4 రోజులు మాత్రమే ఈ హంగామాను కొనసాగించబోతున్నారు.
అవును.. ఎప్పట్లానే మళ్లీ పాలిటిక్స్ పక్కనపెట్టి ముఖానికి రంగేసుకోబోతున్నారు పవన్ కల్యాణ్. ఈనెల 12 నుంచి మళ్లీ సినిమాలు స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుం పవన్ కల్యాణ్ చేతిలో 3 సినిమాలున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఆ 3 సినిమాల్ని లైన్లో పెట్టబోతున్నారు పవన్.
ముందుగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొస్తారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అవుతుంది. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు పవన్.
సో.. ఈనెల 12 నుంచి మరోసారి సినిమాలతో బిజీ అవ్వబోతున్నారు పవన్. ఈమాత్రం దానికి పవన్ తమను ఉద్ధరిస్తాడంటూ ఆయనకు వినతిపత్రాలు ఇవ్వడం, సమావేశాలు ఏర్పాటుచేయడం కామెడీ సీన్ ను తలపిస్తోంది.