తమ్ముళ్ళకు ఊసు పోవడంలేదుట!

అవుని మరి తిరిగే కాలూ, తిట్టే నోరు ఊరికే ఉండలేవు కదా. లాక్ డౌన్ పేరిట కాళ్ళు కట్టేసుకున్నా నోళ్ళు మాత్రం ఆగడంలేదు. అయితే చేస్తున్న ఆరోపణలు మాత్రం అరిగిపోయిన రికార్డులుగా ఉంటున్నాయి. చెప్పినదే…

అవుని మరి తిరిగే కాలూ, తిట్టే నోరు ఊరికే ఉండలేవు కదా. లాక్ డౌన్ పేరిట కాళ్ళు కట్టేసుకున్నా నోళ్ళు మాత్రం ఆగడంలేదు. అయితే చేస్తున్న ఆరోపణలు మాత్రం అరిగిపోయిన రికార్డులుగా ఉంటున్నాయి. చెప్పినదే చెబుతూ బోర్ కొట్టించేస్తున్నారు.

ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేకపోతే జగన్ సర్కార్ దాచేస్తోందని గగ్గోలు పెట్టిన తమ్ముళ్ళు కేసులు ఒక్కసారి పెరగగానే బాబోయి ఏపీని ముంచేశారని జనాలను బెదరగొట్టేస్తున్నారు. ఇక  ఖాళీగా ఉన్న కొందరు మాజీలు జోస్యాలు కూడా చెబుతూ ఏపీలో మహా విలయమే రాబోతోందని హెచ్చరించేస్తున్నారు.

మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు అయితే మే 3 నాటికి రెండు వేలవరకూ కరోనా కేసులు పెరిగిపోతాయని జోస్యం చెప్పేశారు. ఏపీ సర్కార్ ఫెయిల్ అంటున్నారు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు. అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడిదీ ఇదే మాట.

ఇలా బురదజల్లుడు పాలిటిక్స్ కి తెరతీస్తున్న తమ్ముళ్ళు పూర్తిగా లాజిక్ మిస్ అవుతున్నారు.  ఎక్కడా జనంలో లేకుండానే వట్టి కబుర్లు చెబుతూ మీరేం చేస్తున్నారని వైసీపీ పెద్దలను నిలదీయడం కూడా బూమరాంగ్ అవుతోంది.  అవును నిజమే అధినేత పొరుగు రాష్ట్రంలో ఉంటూ నీతులు చెప్పగా లేనిది ఇళ్ళలో ఉంటూ తమ్ముళ్ళు ఆరోపణలు చేయడంతో వింతేముంది.

ఏది ఏమైనా తమ్ముళ్ళ ఆరోపణలకు సీరియస్ నెస్ తగ్గిపోయింది. ఇవన్నీ ఊసుపోక చేసే ఆరోపణలు అని వైసీపీ నేతలు కొట్టి పారేస్తూంటే జనాలు కూడా లైట్ గానే తీసుకుంటునట్లుంది. అందుకే ఎక్కడా నో రియాక్షన్.

అందరినీ ఒక అటాడించిన యాంకర్ రవి కూతురు