ఎన్నికలు ఎపుడు వస్తాయనుకుంటే షెడ్యూల్ ప్రకారం 2024 ఏపీలో వస్తాయి అన్నది అందరికీ తెలిసిందే. ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ చాలా కాలంగా విపక్షాలు చెబుతూ వస్తున్నాయి. అవి వట్టి మాటలు అని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని వైసీపీ ముఖ్య నాయకులు ఆ వైపు నుంచి స్పష్టమైన వివరణ ఇస్తూనే ఉన్నారు.
ఉత్తరాంధాకు చెందిన డిప్యూటీ సీఎం మాత్రం ఎన్నికలు ముందుగా వస్తాయనేలా ప్రకటనలు ఇస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన పీడిక రాజన్న దొర ఎన్నికలు ఎపుడైనా రావచ్చు అని తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఏ క్షణమైనా ఎన్నికలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి ప్రకటించడంతో విపక్షాలు సైతం దాన్ని సీరియస్ గానే చూస్తున్నాయి.
ఎన్నికలు రేపు వచ్చినా తాము సిద్ధమే అని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు తాము ఎన్నికలు ఎపుడూ రెడీగానే ఉంటామని రాజన్నదొర అంటున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నికలు ఎపుడైనా రచ్చు అని కామెంట్స్ చేశారు. ఇలా పదే పదే కీలక స్థానంలో ఉన్న రాజన్న దొర వంటి వారు స్టేట్మెంట్స్ ఇస్తూంటే ముందస్తు ఎన్నికలు ఏపీలో వస్తాయా అన్న సందేహాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.
ఎన్నికలు ఎపుడైనా వస్తాయని భావించి టీడీపీ జనసేన జనంలోనే ఉంటూ వస్తున్నాయి. ఇపుడు డిప్యూటీ సీఎం మాటలతో విపక్షాలు స్పీడ్ ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు అన్న ప్రచారం కూడా జోరందుకుంటోంది. నిజంగా అటువంటి పరిస్థితి ఏపీలో ఉందా, అలాంటి అవసరం అధికార పార్టీకి ఉందా అని వైసీపీతో పాటు ఇతర ప్రత్యర్ధి పార్టీలు సైతం ఆలోచిస్తున్నాయి.