ఓజి వాయిదా వెనుక త్రివిక్రమ్?

ఓజి సినిమా డిసెంబర్ మూడో వారంలో వస్తుందని ఇప్పటి వరకు అనధికార వార్తలు వున్నాయి. ఇప్పుడు ఆ సినిమా ఏప్రియల్ లేదా జూన్ లో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓజి సినిమా షూట్ చాలా…

ఓజి సినిమా డిసెంబర్ మూడో వారంలో వస్తుందని ఇప్పటి వరకు అనధికార వార్తలు వున్నాయి. ఇప్పుడు ఆ సినిమా ఏప్రియల్ లేదా జూన్ లో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓజి సినిమా షూట్ చాలా ఫాస్ట్ గా జరిగింది. జరుగుతోంది. పవన్ ఆ సినిమాకు షూట్ చేయాల్సిన రోజులు కూడా ఎక్కువేమీ లేవు అని సమాచారం. మహా అయితే ఓ ఇరవై రోజులు పవన్ కేటాయించాల్సి వుంటుంది. మరి అలాంటి నేపథ్యంలో డిసెంబర్ నుంచి ఏకంగా నాలుగు నుంచి ఆరు నెలలు వెనక్కు వెళ్లిపోవడం ఏమిటి? అన్నది క్వశ్చను?

ఇటీవలే పవన్ సినిమా బ్రో విడుదలైంది. ఆశించన మేరకు ఆడలేదు. పవన్ ఫ్యాన్స్ చాలా డిస్సపాయింట్ అయ్యారు. చాలా మంది పవన్ సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ ను గట్టిగా విమర్శించారు. సరైన సినిమాలు సెట్ చేయడం లేదు. అంతా త్రివిక్రమ్ నే చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ లెక్కలో వేసుకున్నారు. బ్రో సినిమాను సెట్ చేసింది, కథను, స్క్రీన్ ప్లేను మార్చింది, మాటలు అందించింది త్రివిక్రమ్ నే. వదిలిన వర్కింగ్ వీడియోలో త్రివిక్రమ్ మైక్ పట్టుకుని మోనిటర్ ముందు కూర్చుని డైరక్షన్ చేస్తున్నట్లు కూడా కనిపించింది.

సరే బ్రో సంగతి అలా వుంచితే ఇప్పుడు త్రివిక్రమ్ ఫుల్ బిజీ. వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా, పక్క సినిమాల కేసి చూడకుండా వుంటేనే సంక్రాంతికి గుంటూరు కారం సినిమా వస్తుంది. పైగా ఈ సారి మహేష్ బాబు క్వాలిటీ చెక్ విషయంలో మామూలుగా లేరు. ప్రతి అడుగులో ఆయన భూతద్దం పెట్టి మరీ చూస్తున్నారు. గుంటూరు కారం సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ ఆఖరికి షూట్ పార్ట్ పూర్తయిపోవాలి. డిసెంబర్ నుంచి విడుదల వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వుంటుంది.

అందువల్ల వన్ మినిట్ కూడా తన సలహా సంప్రదింపులు త్రివిక్రమ్ ఓజి సినిమాకు ఇవ్వలేరు. ఓజి సినిమాను సెట్ చేసింది త్రివిక్రమ్ నే. దర్శకుడు సుజిత్ చాలా నెలలు త్రివిక్రమ్ తో కలిసి హోమ్ వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారనే వార్తలు వున్నాయి. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులో భాగస్వామి అనే గ్యాసిప్ లు కూడా వున్నాయి. కానీ నిజా నిజాలు తెలియవు. అలాంటి ప్రాజెక్ట్ మీద త్రివిక్రమ్ దృష్టి పెట్టి వుంచకపోతే ఎలా?

అదే గుంటూరు కారం అయిపోతే, మళ్లీ బన్నీ వచ్చే వరకు అంటే దాదాపు ఆరు నెలలు త్రివిక్రమ్ కాస్త ఖాళీనే. అప్పుడు ఓజి కి ఏ సలహా సంప్రదింపులు కావాలన్నా ఇవ్వగలరు. బహుశా అందుకే డిసెంబర్ నుంచి ఏప్రిల్ లేదా జూన్ కు ఓజి విడుదల ప్లాన్ ను వాయిదా వేసి వుంటారనే గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.