సుమ‌ల‌త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు

క‌ర్నాట‌క‌లోని మండ్య స్వతంత్ర ఎంపీ, న‌టి, తెలుగింటి ఆడ‌బిడ్డ‌ సుమ‌ల‌త‌పై మాజీ సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి వివాదాస్ప‌ద, అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు క‌ర్నాట‌క‌లో రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత…

క‌ర్నాట‌క‌లోని మండ్య స్వతంత్ర ఎంపీ, న‌టి, తెలుగింటి ఆడ‌బిడ్డ‌ సుమ‌ల‌త‌పై మాజీ సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి వివాదాస్ప‌ద, అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు క‌ర్నాట‌క‌లో రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కృష్ణ‌రాజ‌సాగ‌ర (కేఆర్‌ఎస్‌) డ్యామ్‌ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కృష్ణ‌రాజ‌సాగ‌ర జ‌లాశ‌యం చుట్టూ అక్ర‌మంగా గ‌నుల త‌వ్వ‌కంతో పాటు ఇసుక దందా కొన‌సాగుతోంద‌ని ఇటీవ‌ల‌ సుమ‌ల‌త ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో జ‌లాశ‌యానికి ప‌గుళ్లు ఏర్ప‌డుతున్న‌ట్టు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

సుమ‌ల‌త ఆరోప‌ణ‌ల‌ను మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి (జేడీఎస్‌) జీర్ణించుకోలేక‌పోయారు. ఆయ‌న త‌న‌యుడు నిఖిల్ కుమార‌స్వామిపై సుమ‌ల‌త స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నిలిచి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయంగా త‌మ‌ను మ‌ట్టిక‌రిపించిన సుమ‌ల‌త‌పై మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి విచ‌క్ష‌ణ మ‌రిచి తీవ్రంగా స్పందించారు.

జ‌లాశ‌యం అన‌క‌ట్టకు ఏదైనా ముప్పు ఏర్ప‌డితే ఆమెను అడ్డంగా ప‌డుకోబెతితే స‌రి…నీళ్లు బ‌య‌ట‌కు రావంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కుమార‌స్వామి ఆరోప‌ణ‌ల‌పై సుమ‌ల‌త ఘాటుగా స్పందించారు.  

మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని విరుచుకుప‌డ్డారు. ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని అన్నారు.  ఇది ఆయ‌న నైజాన్ని తెలియ‌జేస్తోంద‌న్నారు.