వైష్ణవ్ తేజ్-సురేందర్ రెడ్డి కాంబో

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఉప్పెన తరువాత ఇప్పటికే రెండు సినిమాలు వున్నాయి హీరోకి. ఇది మూడోది.   Advertisement దర్శకుడు సురేందర్ రెడ్డితో ఈ సినిమా చేయబోతున్నాడు.…

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఉప్పెన తరువాత ఇప్పటికే రెండు సినిమాలు వున్నాయి హీరోకి. ఇది మూడోది.  

దర్శకుడు సురేందర్ రెడ్డితో ఈ సినిమా చేయబోతున్నాడు. అయితే కథ మాత్రం సురేందర్ రెడ్డిది కాదు. సీనియర్ దర్శకుడు దశరధ్ కథ అందిస్తున్నారు.

ఈ మేరకు హీరో-డైరక్టర్ల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా బోగవిల్లి ప్రసాద్ వ్యవహరిస్తారు. అయితే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే లోగా సురేందర్ రెడ్డి హీరో అఖిల్ తో ఏజెంట్ సినిమా పూర్తి చేయాలి. వీలైతే పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేయాలి. ఆ తరువాత ముచ్చట ఇది. 

వైష్ణవ్ తేజ్ కూడా ఈ లోగా రెండు సినిమాలు ఫినిష్ చేయాల్సి వుంది.