హీరోయిన్ మెహరీన్ తో హీరో సాయిధరమ్ తేజ్ కు ఏమిటి సమస్య? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మెహరీన్ ను హీరోయిన్ గా పెట్టాలనే ప్రపోజల్ కు హీరో సాయిధరమ్ తేజ్ మోకాలు అడ్డం పెడుతున్నట్లు తెలుస్తోంది. మెహరీన్ తప్ప ఎవరైనా తనకు ఓకె అని సాయిధరమ్ తేజ్ అంటున్నట్లు తెలుస్తోంది.
మెహరీన్ గతంలో సాయిధరమ్ తేజ్ తో చేసింది. జవాన్ చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు. పైగా సాయిదరమ్ తో పోలిస్తే మెహరీన్ హిట్ ట్రాక్ లో వుంది. ఎఫ్ 2లో ఆమెకు మంచి పేరు వచ్చింది. కానీ సాయిధరమ్ మాత్రం ఫ్లాపుల ట్రాక్ లో వున్నాడు. మరి అలాంటిది తన సినిమాకు మెహరీన్ వద్దు అనడానికి కారణం ఏమిటో తెలియదు.
పైగా దర్శకుడు మారుతికి కూడా మెహరీన్ తో మంచి హిట్ వుంది. మహానుభావుడు సినిమా వాళ్ల కాంబినేషన్ లో మంచి హిట్. మెహరీన్ ను వద్దు అనడంతో ఎబిసిడిలో అల్లుశిరీష్ తో నటించిన రుష్కార్ ధిల్లాను ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే అల్లు అరవింద్ ఈ సినిమాను వీలయినంత తక్కువ బడ్జెట్ లో చుట్టే ప్రయత్నంలో వున్నారని బోగట్టా.
అంతాకలిపి ఏడెనిమిది కోట్లలో తీయాలని, అలా అయితే సాయిధరమ్ తో సేఫ్ ప్రాజెక్టు అవుతుందనే ఆలోచనలో రుష్కార్ ను తీసుకున్నారని తెలుస్తోంది. మెహరీన్ అయితే 75లక్షల వరకు అవుతుంది. అదే రుష్కార్ అయితే, అయిదు పది లక్షలతో అయిపోతుంది.