Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టీజర్ కన్నా పాటకే అప్లాజ్

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తొలిసారి నటిస్తున్న దొరసాని సినిమా టీజర్ ఇటీవల వచ్చింది. అయితే ఫ్యాన్స్ వార్ కావచ్చు, మరేదైనా కావచ్చు, ఈ టీజర్ ను విపరీతంగా ట్రోల్ చేసారు. ఇంతలోనే ఫస్ట్ సాంగ్ వదిలారు. నింగిలోన పాలపుంత అంటూ సాగిన ఈపాటకు కొన్ని ఫొటో స్టిల్స్ మాత్రం జోడించి, సాంగ్ లిరిక్స్ యాడ్ చేసి వదిలారు.

నింగిలోన పాలపుంత నవ్వులొంపినే, నేలపైన పాలపిట్ట తొవ్వగాసినే అంటూ సాగిన ఈ పాటకు రెండు ప్రత్యేకతలు వున్నాయి. ఒకటి ఇనుస్ట్రుమెంటేషన్ పాట లిరిక్స్ ను మింగేయలేదు. ఈ పాటను ప్రసిద్ధ తెలంగాణ రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న రచించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన పాటకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. పాట లిరిక్స్ ఆద్యంతం హాయిగా వున్నాయి. ట్యూన్ కూడా సున్నితంగా, గడబిడ లేకుండా సాగింది.

మధుర శ్రీధర్, యాష్ రంగినేని నిర్మించే ఈ సినిమాకు సురేష్ బాబు సమర్పకుడు. సీనియర్ హీరోయిన్ జీవిత కుమార్తె శివాత్మిక కూడా ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నారు.

పవనం ఏడాది పొడుగునా.. ఋతుపవనం సీజనల్‌.. మరి పవన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?