క‌రోనా చైన్: ఇండియాకు ఒక గుడ్ న్యూస్!

క‌రోనాను నివారించాలంటే దాని చైన్ ను విడ‌గొట్ట‌డ‌మే మార్గ‌మ‌ని మొద‌టి నుంచి ప‌రిశోధ‌కులు చెబుతూ ఉన్నారు. క‌రోనా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుంద‌ని, ఆ చైన్ ను బ్రేక్ చేశామంటే క‌రోనా వ్యాప్తి…

క‌రోనాను నివారించాలంటే దాని చైన్ ను విడ‌గొట్ట‌డ‌మే మార్గ‌మ‌ని మొద‌టి నుంచి ప‌రిశోధ‌కులు చెబుతూ ఉన్నారు. క‌రోనా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుంద‌ని, ఆ చైన్ ను బ్రేక్ చేశామంటే క‌రోనా వ్యాప్తి ఆగిపోతుంద‌ని వారు వివ‌రిస్తూ ఉన్నారు. బ్రేక్ ది చైన్ లో భాగంగానే లాక్ డౌన్ ప‌రిష్కార మార్గ‌మ‌ని అంటూ ఉన్నారు. అయితే ఇప్ప‌టికే వ్యాప్తిలోకి వ‌చ్చిన క‌రోనా ఇంకా పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ‌లోకి రాలేదు. ఇండియాలో లాక్ డౌన్ ను పాటిస్తున్నా.. ఇరుగిల్లూ, పొరుగిల్లు స్థాయిలో క‌రోనా వ్యాపించి కొత్త కేసులు రిజిస్ట‌ర్ అవుతూనే ఉన్నాయి. మ‌రోవైపు లాక్ డౌన్ కొన‌సాగుతూ ఉంది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో అమెరికాలో జ‌రిగిన ఒక తాజా ప‌రిశోధ‌న ఇండియాకు గుడ్ న్యూస్ లాంటి విష‌యాన్ని చెప్పింది. అదేమిటంటే.. అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు, ఉక్క‌పోత ఉండే ప్రాంతంలో క‌రోనా వైర‌స్ తొంద‌ర‌గా న‌శించిపోతోంది అనేది! 

ఈ మాట మొద‌ట్లోనే చెప్పారు. 26 డిగ్రీల సెంటీగ్రేడ్ పై స్థాయి వాతావ‌ర‌ణం ఉన్న చోట క‌రోనా అంత తేలిక‌గా వ్యాపించ‌ద‌న్నారు. అయితే ఇండియాలో క‌రోనా త‌న కు వీలైన‌ట్టుగా వ్యాపించింది. కానీ అమెరిక‌న్ తాజా ప‌రిశోధ‌న ఆస‌క్తిదాయ‌కంగానే ఉంది.

వీళ్లు చెప్పేదేమిటంటే.. భూత‌లం మీద కానీ, ఏదైనా వ‌స్తువు మీద కానీ.. క‌రోనా వైరస్ కొన్ని గంట‌ల పాటు ఉంటుంద‌ని మొద‌టి నుంచి చెబుతున్నారు క‌దా, కొన్ని ర‌కాల వ‌స్తువుల‌పై 18 గంట‌ల వ‌ర‌కూ క‌రోనా వ్యాపించేంత శ‌క్తితో ఉంటుంద‌ని అంటున్నారు క‌దా.. అయితే 36 డిగ్రీల పై స్థాయి ఉష్ణోగ్ర‌త‌లో క‌రోనా వైర‌స్ పూర్తిగా న‌శించిపోతుంద‌ని తాజా ప‌రిశోధ‌న చెబుతూ ఉంది. ఉష్ణోగ్ర‌త 36 డిగ్రీల‌ను దాటిందంటే.. ఏదైనా త‌లం మీద అయినా, వ‌స్తువు మీద అయినా.. క‌రోనా వైర‌స్ నిమిషాల్లోనే న‌శించి పోతుంద‌ని ఈ ప‌రిశోధ‌కులు ధీమాగా చెబుతూ ఉన్నారు!

అలాగే ఉక్క‌పోత‌లో కూడా క‌రోనా వైర‌స్ న‌శించిపోతుంద‌ని అంటున్నారు. అయితే ఇదంతా బ్యాక్టీరియా వాహ‌కంగా వాతావ‌ర‌ణంలోకి చేరిన క‌రోనా వైర‌స్, ఏ వ్య‌క్తి నుంచి అయినా ఏదైనా వ‌స్తువుకు అంటుకున్న వైర‌స్ విష‌యంలో ప‌ని చేస్తుంది. ఒక్క‌సారి మ‌నిషి లోపల‌కు క‌రోనా చేరితే.. బ‌య‌టి వాతావ‌ర‌ణంతో సంబంధం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. కానీ.. క‌రోనా చైన్ బ్రేక్ కావ‌డంలో వాతావ‌ర‌ణం కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అమెరిక‌న్ ప‌రిశోధ‌కులు ధీమాగా చెబుతున్నారు. 36 డిగ్రీల సెంటీగ్రేడ్ పై స్థాయి వాతావ‌ర‌ణంలో క‌రోనా చైన్ వీక్ అవుతుంద‌ని వారు అంటున్నారు. ఇది వంద‌శాతం నిజ‌మే అయితే ఇండియాకు ఇది క‌చ్చితంగా శుభ‌వార్తే. ఎందుకంటే మ‌న ద‌గ్గ‌ర ఇప్పుడు చాలా చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీల పై స్థాయిలో ఉన్నాయి.

అలాగే బ్లీచ్ కూడా క‌రోనా వైర‌స్ ను 5 నిమిషాల్లో చంపుతుంద‌ని, ఐపోప్రోపిల్ ఆల్కాహాల్ కేవ‌లం 30 సెక‌న్ల‌లో క‌రోనా వైర‌స్ ను చంపుతుంద‌ని అమెరిక‌న్ ప‌రిశోధ‌కులు వివ‌రిస్తున్నారు.

లోకమణి అమ్మకి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు