రీమేక్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్న పవన్

షూటింగ్ మొదలై చాన్నాళ్లయింది. మరికొన్ని రోజుల్లో మరో షెడ్యూల్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు పవన్-రానా సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటన మాత్రం రాలేదు. ఇన్నాళ్లూ ఈ సినిమాను అయ్యప్పనుమ్…

షూటింగ్ మొదలై చాన్నాళ్లయింది. మరికొన్ని రోజుల్లో మరో షెడ్యూల్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు పవన్-రానా సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటన మాత్రం రాలేదు. ఇన్నాళ్లూ ఈ సినిమాను అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ గా, లేదంటే పవన్-రానా సినిమాగా మాత్రమే సంభోదిస్తున్నారు. హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇలానే పాపులర్ అయ్యాయి.

ఈ గ్యాప్ లో సందట్లో సడేమియా అన్నట్టు చాలా పేర్లు పుట్టుకొస్తున్నాయి. సినిమా స్టార్ట్ అయిన వెంటనే మొట్టమొదట వినిపించిన పేరు బిల్లా-రంగా. అయితే ఆ టైటిల్ కరెక్ట్ కాదని, ఆ టైటిల్ పెట్టడం లేదని యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఆ తర్వాత మరో 2-3 టైటిల్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు ఫ్రెష్ గా పరశురామ కృష్ణమూర్తి అనే పేరు వినిపిస్తోంది.

ఈ టైటిల్ తో పవన్ ఫ్యాన్స్ ఆల్రెడీ పోస్టర్లు కూడా తయారుచేసి వైరల్ చేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే.. ఈ టైటిల్ కూడా అఫీషియల్ కాదు. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్, ప్రస్తుతానికి 3 టైటిల్స్ ఫిక్స్ చేశాడు. అందులో ఒక టైటిల్ ను పవన్ లాక్ చేయాల్సి ఉంది.

త్రివిక్రమ్ చెప్పిన ఆ 3 టైటిల్స్ ను అటుఇటు చేసి, ఓ కొత్త టైటిల్ సృష్టించే పనిలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే సినిమాకు కూడా పవన్ ఇలానే 2-3 టైటిల్స్ రీమిక్స్ చేసి కొత్త పేరు ఫిక్స్ చేశారు. 

ఇప్పుడు త్రివిక్రమ్ చెప్పిన టైటిల్స్ ను కూడా అలానే రీమిక్స్ చేసి ఓ కొత్త టైటిల్ సృష్టించబోతున్నారు. పవన్ చెప్పిన తర్వాత ఇక అదే ఫైనల్ అనే విషయం తెలిసిందే.

మరో 2 రోజుల్లో పొలిటికల్ గా చిన్న సందడి చేయబోతున్నారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత ఓ మంచి రోజు చూసి టైటిల్ ను ప్రకటిస్తారు.