ఎన్నాళ్ల నుంచో వార్తల్లో వినిపిస్తున్న దగ్గుబాటి వారి చిన్న హీరో లాంచ్ వ్యవహారం ఈ రోజుకు కొలిక్కి వచ్చింది.
రానా సోదరుడు, సురేష్ బాబు తనయుడు అభిరామ్ తొలి సినిమా ఈ రోజు చాలా సింపుల్ గా ప్రారంభమైపోయింది. గత కొంత కాలంగా దర్శకుడు తేజ కొత్త హీరోల కొసం గాలం వేసి వెదుకుతున్నారు.
ఎన్టీఆర్ బావమరిదిని లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ పెట్టుబడి లెక్కలు కుదరలేదు. తన కొడుకునే స్వయంగా లాంచ్ చేస్తారని వార్తలు కూడా వినిపించాయి. ఆఖరికి దగ్గుబాటి అభిరామ్ తో ఆ సబ్జెక్ట్ ను తెరకెక్కించాలని డిసైడ్ అయినట్లు బొగట్టా.
సినిమా తేజ-సురేష్ ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో నిర్మాణం అవుతుంది. మిగిలిన వివరాలు తెలియాల్సి వుంది.