పెళ్లి కాకుండానే విడిపోయిన మెహ్రీన్ జంట

హర్యాణ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్యతో మెహ్రీన్ కు పెళ్లి సెట్ అయింది. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. శీతాకాలంలో పెళ్లి ఉంటుందని, డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు మెహ్రీన్…

హర్యాణ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్యతో మెహ్రీన్ కు పెళ్లి సెట్ అయింది. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. శీతాకాలంలో పెళ్లి ఉంటుందని, డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు మెహ్రీన్ ప్రకటించింది కూడా. అంతలోనే పెద్ద కుదుపు.

అవును.. భవ్యతో తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుంది మెహ్రీన్. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ లో అధికారిక ప్రకటన చేసింది. ఇకపై తనకు భవ్యకు సంబంధం లేదని క్లియర్ గా చెప్పేసింది.

“మా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని భవ్య, నేను నిర్ణయించుకున్నాం. ఇక మా పెళ్లి జరగదు. అందరి సమ్మతంతో, అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఈ క్షణం నుంచి భవ్యతో, అతడి కుటుంబంతో, స్నేహితులతో నాకు ఎలాంటి అసోసియేషన్ లేదు. నా నిశ్చితార్థం రద్దుకు సంబంధించి నేను ఇస్తున్న ఒకే ఒక్క స్టేట్ మెంట్ ఇది. నా ప్రైవసీని అంతా గౌరవిస్తారని ఆశిస్తున్నాను.”

ఇలా తన పెళ్లి రద్దయిన విషయాన్ని మెహ్రీన్ బయటపెట్టింది. నిశ్చితార్థం తర్వాత సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకుంది మెహ్రీన్. కాబోయే భర్త భవ్యతో కలిసి మాల్దీవులు పర్యటనకు కూడా వెళ్లింది. సముద్ర గర్భంలో భవ్య ఆమెకు లవ్ కూడా ప్రపోజ్ చేశాడు. రింగ్ కూడా తొడిగాడు.

ఇంత హంగామా జరిగిన తర్వాత భవ్యను పెళ్లి చేసుకోవడం లేదంటూ మెహ్రీన్ ప్రకటించి సంచలనం సృష్టించింది. పెళ్లి ఎందుకు కాన్సిల్ అయిందనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. ఎప్పట్లానే భవిష్యత్తులో కూడా సినిమాలు కొనసాగిస్తానని, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తానని మాత్రం ప్రకటించింది మెహ్రీన్. ఈ స్టేట్ మెంట్ ఇవ్వడానికి కొన్ని గంటల ముందు, నవ్వులు చిందిస్తూ ఆమె ఎఫ్3 సినిమా సెట్స్ లో జాయిన్ అయింది.